Sunday, June 23, 2024

కెసిఆర్ ని నమ్మకు ఉన్నది అమ్ముకోకు

తప్పక చదవండి
  • నిరుద్యోగుల పొట్ట కొట్టిన కెసిఆర్ ను భూస్థాపితం చేస్తాం
  • 40 ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలురాలేదు.. పెళ్లిళ్లుకాలేదు
  • వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేసిన నిరుద్యోగి
  • తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అంటివి కద దొర?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు ఏర్పడి మన బతుకులు బాగుపడతాయని, మన కొలువులు మనకే వస్తాయని ఎందరో నిరుద్యోగులు యువత ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా పోరాటం చేసి సాధించుకున్నాము. తెలంగాణలో నిరుద్యోగుల ఆవేదన వర్ణననాతీతం ఇంటికో ఉద్యోగం అంటూ ఉదరగొట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావుగద్దెనెక్కిన తర్వాత మాట మార్చి మేము ఇంటికి ఉద్యోగం ఎక్కడ అనలేదు అంటూ పచ్చి అబద్దాల మాట్లాడడం సిగ్గుచేటని ఇలాంటి ముఖ్యమంత్రిని ఓడించి నిరుద్యోగులకు మోసం చేసిన బిఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తాం అంటూ ఓ నిరుద్యోగి వినూత్న రీతిలో నామినేషన్ వేశాడు.

వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేసిన నిరుద్యోగి
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ లు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ అనే ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ అయినా నిరుద్యోగి వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. చిరిగినా అంగి మెడలో ఖాళీ బిరుసీసాలో ఇది బంగారు తెలంగాణ కాదు అడుక్కు అంటూ ఫ్లకాడ్ల చేతిలో పట్టుకుని ప్రచారం చేశారు మునుగోడు గజ్వేల్ శాసనసభలకు నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు ఓ నిరుద్యోగ సోదరులారా కెసిఆర్ ను నమ్మకు ఉన్నది అమ్ముకోకు అనే విధంగా నడుస్తుందని అలాంటి మోసకారిని నమ్మద్దని రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే అన్ని అడ్డంకులేనని లిక్కర్కు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన అన్నారు. ఉద్యోగాలు అడిగితే లిటిగేషన్ పెట్టి న్యాయస్థానాల్లో కేసులు వేయించేది కూడా కెసిఆర్ అని అతని నమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని ఇప్పుడు నిరుద్యోగులంతా ఏకమై ఈ సర్కార్ను భూస్థాపితం చేద్దామంటూ ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్ని జిల్లాలను అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ని అభివృద్ధి చేసుకున్నట్టు ఇతర నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని మీకు ఇంత వివక్ష ఎందుకంటూ మండిపడ్డాడు తెలంగాణ వస్తే 92,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ పది సంవత్సరాలు గడిచిన ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగుల బతుకులను ఆగం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో పెన్షన్ ఇస్తున్నాను అని చెప్పే ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచి తెలంగాణ ను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండని కెసిఆర్ కు ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణమని రైతులను నిండా ముంచిండని ఇప్పుడు మళ్లీ అధికారం దక్కించుకునేందుకు బయలుదేరాడని ప్రజలకు అవే మాయమాటలు చెబుతూ ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కెసిఆర్ ని నమ్మొద్దని బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకుండా కెసిఆర్ ని నిరుద్యోగినిచేస్తే మన బాధలు అర్థం అవుతాయి. మన అంతిమ లక్ష్యం కూడా అదేనని తెలిపారు.

- Advertisement -

బండమీద,ఎండ, దున్నపోతు,మీదవాన పడ్డ కెసిఆర్ ఓటేసిన ఒక్కటే
రాష్ట్రంలో కెసిఆర్ పరిపాలన బండ మీద ఎండ కొట్టినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు, ఉందని మూడోసారి ఆయనకు ఓటు వేస్తే నిరుద్యోగుల బతుకులు కుక్కలు చింపిన విస్తరాకుల అవుతుందని ప్రజల ఒంటి మీద ఉన్న బట్టలను కూడా లాగేసుకుంటాడని కెసిఆర్ ను నమ్మొద్దు అంటూ ఆయన తెలంగాణ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టాడు. ఇప్పటికే కెసిఆర్ నమ్మి ప్రజలు ఆగమయ్యారని ఇప్పుడైనా చదువుకున్న విద్యావంతులు ఆలోచన చేసి ప్రజలను చైతన్యపరిచి దుర్మార్గమైన కెసిఆర్ పతనానికి నాంది పలకాలని అప్పుడే ప్రజలు ఆశించే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ప్రతి ఒక్క నిరుద్యోగి తమ బాధ్యతగా ఎన్నికల రణ రంగంలోకి వచ్చి బిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రతి నిరుద్యోగ సోదరునికి చేతులెత్తి మొక్కుతానని అన్నారు.

40 ఏళ్లు దాటిన ఉద్యోగం రాలేదు పెళ్లిళ్లు కాలేదు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంది నిరుద్యోగులకు 40 ఏళ్లు వచ్చిన ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు చేసుకుందామంటేఎవ్వరు పిల్లనివ్వక గోసలు పడుతున్నామని అప్పులు చేసి హైదరాబాద్ నగర వీధుల్లో ఎన్నో అవస్థలు పడుతున్నామని ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేక అవ్వయ్యలను బాధలు పెట్టడమే కానీ వారిని సుఖపెట్టలేకపోతున్నామని సగటు నిరుద్యోగి ఆవేదన అని అందుకే నిరుద్యోగులార ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దుర్మార్గమైన నాయకుల పతనం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు