Monday, April 29, 2024

మల్కాజ్ గిరి సీటు మైనంపల్లిదేనా…

తప్పక చదవండి
  • ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నగులాబీ బాస్‌..
  • కొత్త అభ్యర్థిని ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం..
  • అభ్యర్థుల్లో ప్రధానంగా వినబడుతున్న నలుగురి పేర్లు..
  • పరిశీలనలో శంభీపూర్‌ రాజు,రామ్మోహన్‌తో పాటు రాజశేఖర్‌ రెడ్డి పేర్లు..
  • ఓ మాజీని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్‌ ఇస్తారని జోరందుకున్న ప్రచారం !
  • ఈ సందిగ్దతకు పులిస్టాప్‌ పడే అవకాశం ఉందా..? అంటున్న విశ్లేషకులు..
    హైదరాబాద్‌ : మైనంపల్లి కామెంట్స్‌ కారు పార్టీలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో మల్కాజ్‌ గిరి సీటుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మెదక్‌ సీటుపై మైనంపల్లి కామెంట్స్‌ అనంతరం ఆయనకు కేసీఆర్‌ టికెట్‌ కేటాయించబోరని కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు.మరి కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలయితే మైనంపల్లి కామెంట్స్‌ ను కేసీఆర్‌ అంతగా పట్టించుకోలేదని, ఆయన ఒక సీనియర్‌ లీడరు కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకోరని గట్టిగా చెబుతున్నారు. ఏది ఏమయినా త్వరలో ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదంటూ పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మైనంపల్లి వ్యవహారంపై పార్టీ అంతర్గంతంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తీసుకున్న నిర్ణయాన్నిమాత్రం కేసీఆర్‌ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కొత్త అభ్యర్థిని ఖరారు చేస్తారా..? లేక మైనంపల్లి సీటుపై నెలకొన్న సందిగ్దతకు కేసీఆర్‌ ఫుల్‌ స్టాప్‌ పెడతారా..? అన్నది తేలుతుందని పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
    మైనంపల్లి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న గులాబీ టీమ్‌ :
    మల్కాజ్‌ గిరి సీటు అంశంపై సీఎం కేసీఆర్‌ లోతుగానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్‌ రావు టార్గెట్‌ గా మైనంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అంశాన్ని పార్టీ హైకమాండ్‌ చాలా సీరియస్‌ గా తీసుకుంది. దీంతో మైనంపల్లి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇక్కడ కొత్త అభ్యర్థిని ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు గులాబీ వర్గాల మేరకు సమాచారం అందుతోంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించగా… కొత్తగా మరో సీనియర్‌ నేత పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
    ముందుగా నోటీసులు ఆ తరువాతే నిర్ణయం :
    మంత్రి హరీశ్‌ రావ్‌ పై మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ తో పాటు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై చర్యలకు సిద్ధమవుతోందట బీఆర్‌ఎస్‌ హైక మాండ్‌. హరీశ్‌ రావ్‌ పై చేసిన కామెంట్స్‌ పై వివరణ కోరుతూ ముందుగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట.. ఆయన్నుంచి వచ్చే రియాక్షన్‌ బట్టి వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
    మైనంపల్లిని మారిస్తే కొత్తగా కేసీఆర్‌ ఎవరికి అవకాశం కల్పిస్తారు..?
    మైనంపల్లిని పక్కనపెడితే మల్కజ్‌ గిరి అభ్యర్థిగా ఎవరిని దింపాలన్న దానిపై కూడా గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డితో పాటు, కుత్బుల్లాపూర్‌ టికెట్‌ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్లను కూడా ఆయన పరిశీస్తున్నట్లు సమాచారం. అయితే శంభీపూర్‌ రాజువైపు గులాబీ అధినాయకత్వం కాస్త మొగ్గు చూపినప్పటికీ, ఆయన ఆసక్తికరంగా లేరని తెలుస్తోంది. ఇక కేటీఆర్‌ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నమాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కి, కేసీఆర్‌ మల్కాజ్‌ గిరి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతే కాకుండా కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్‌ ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది.. ఇవన్నీ ఇలా ఉంటే, అనూహ్యంగా మరో సీనియర్‌ నేత పేరును కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నారట..! ఇప్పుడు ఇదే గులాబీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే మల్లారెడ్డి శుక్రవారం మర్రి రాజశేఖర్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ ను కలవడంపై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మల్లారెడ్డి తన అల్లుడికి మల్కాజ్‌ గిరి స్థానం నుంచి టికెట్‌ కేటాయించమని కోరగా దానికి సమాధానంగా కేటీఆర్‌ ఇంకా సమయం ఉందని బదులిచ్చి మల్లారెడ్డి ప్రపోజల్‌ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
    కుటుంబంలో ఒక్కరికే సీటు కేటాయిస్తాం :
    కుటుంబంలో ఒకరికే బీఆర్‌ఎస్‌ పార్టీ సీటును కేటా యించడం జరుగు తోందని కేసీఆర్‌ నిర్మిహ మాటంగా తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యం లో మంత్రి మల్లారెడ్డి కేటీఆర్‌ ను కలువడం, తన అల్లుడికి మైనంపల్లి కి కేటాయించిన సీటును కేటాయించండని అడగడం పార్టీలో చర్చనీj ుంశంగా మారింది. బీఆర్‌ ఎస్‌ పార్టీ లో ఏ నిర్ణయమైనా చివరగా కేసీఆర్‌ తీసుకుం టారని తెలిసినా మల్లారెడ్డి పనిగట్టుకుని అల్లుడిని వెంటబెట్టుకుని కేటీఆర్‌ చెంతకు వెళ్లి టికెట్‌ ఆశించడంపై అసలు మతలబేంటని పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో మైనంపల్లి అన్ని విషయాల్లో విభేదించిన విషయాన్ని గుర్తుచేయాలను కుంటున్నారా.. లేక మైనంపల్లిఫై తనకున్న కోపాన్ని తీర్చుకోవడానికి అల్లుడికి టికెట్‌ ఆశిస్తున్నారా అనేది తేలాల్సివుంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు