Monday, April 29, 2024

గజవాహనంపై మలయప్ప..

తప్పక చదవండి
  • పరవశించి పోయిన భక్త జనం..
    తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి మలయప్పస్వామి గజవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను అలరించాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని దర్శించుకొని పులకించిపోయారు. అయితే, అంతకు ముందుస్వామి స్వర్ణ రథంపై నుంచి అనుగ్రహించారు. నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధుల్లో కడురమణీయంగా స్వర్ణర‌థోత్సవం కనుల పండువలా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు