Saturday, May 18, 2024

తాగు జలాలపై.. గళం విప్పిన బీఎల్‌ఆర్‌..

తప్పక చదవండి
  • స్పందించిన మంత్రి కోమటిరెడ్డి..

మిర్యాలగూడ : చెంతనే కృష్ణమ్మ ఉన్న.. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పల్లెలు పట్టణాలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వం అటహాసంగా ప్రారంభించిన మిషన్‌ భగీరథ లోప భూయిష్టంగా తయారయిందంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ఆర్‌) జిల్లా కలెక్టరేట్లో జరిగిన రివ్యూ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం మంత్రిగా పదవి స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి అట్టహాసంగా మొదలుపెట్టిన మిషన్‌ భగీరథ పథకం మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద కృష్ణ నది నుండి 6 నియోజకవర్గాలకు శుద్ధి జలాలను అందించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ మిర్యాలగూడ నియోజకవర్గం లోని మిర్యాలగూడ పట్టణంతో పాటు అనేక గ్రామాలకు పరిశుభ్రమైన తాగునీరు అందే పరిస్థితి లేదని అన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వలన మిషన్‌ భగీరథ పైపులలో వచ్చే నీరు కూడా మురికినీరు వస్తుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.స్పందించిన మంత్రి కోమటిరెడ్డి ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ కలెక్టర్‌ ను ఆదేశించారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు