Monday, April 29, 2024

శివ‌బాలకృష్ణ అవినీతి వెనుక కేటిఆర్ హస్తం

తప్పక చదవండి
  • టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

హెచ్ఎండిఏ, కుంభకోణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ హస్తం ఉందని చనగాని దయాకర్ విమర్శించారు. శ‌నివారం ఓయూలో చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.. హైద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో విలువైన భూముల అస్తగతం చేసుకోవడంలో కేటీఆర్ బృందం అవినీతికి తెగబడ్డారు. హెచ్ఎండిఏ శివ‌బాలకృష్ణ లాగానే మరికొంత మంది తిమింగాలాలూ ఉన్నారని వాళ్లు కూడా త్వ‌ర‌లోనే జైళ్లకు వెళ్తారని హెచ్చ‌రించారు. ప్రజాపాలనపై మాట్లాడే నైతిక అర్హ‌త కేటీఆర్, హరీష్ రావు ల‌కు లేదని అన్నారు. డైరెక్టర్ రూ. 500 కోట్లు సంపాదిస్తే.. పోస్ట్ ఇచ్చిన కేటీఆర్ ఎంత సంపాదించారో తెలంగాణ సమాజం అలోచించాలని అన్నారు. 7 ఏళ్లు పని చేసిన శివ బాలకృష్ణ దాదాపు వేల ఎకరాలకు లేఔట్ పర్మిషన్ ఇచ్చారని అన్నారు… ఢిల్లీలో ఉన్న అరవింద్ కుమార్ ని తీసుకవచ్చి హెచ్ఎండిఏ కమీషనర్ పోస్ట్ ఇచ్చి అవినీతికి తెగపడ్డార‌ని మండిప‌డ్డారు. అరవీంద్ సెలవు పెట్టి విదేశాలకు వెళ్లే ప్రత్నయం చేస్తుండని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, మిషీన్ బాగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్ట్ మెడలు పెట్టి పైసల కోసం ప్రాజెక్ట్ సృష్టించారని విమర్శించారు. గత ప్రభుత్య పాలనలో ప్రజలు సిగ్గు పడేలా అవినీతి జరిగిందని అన్నారు. ఈకార్యక్రమమం లో ఎన్ఎస్ యుఐ ఓయూ ప్రెసిడెండ్ మెడ శ్రీను, ఓయూ విద్యార్థి నాయకులు సుమన్ గౌడ్, స్వాతి, సైదులు, మహేంద్ర, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు