Tuesday, May 14, 2024

ధర్మం వైపు కాట.. అధర్మంవైపు గూడెం

తప్పక చదవండి
  • కాటా శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి
  • పటాన్ చెరుపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలి
  • ఇందిరమ్మ పాలనలోనే పటాన్ చెరు అభివృద్ధి చెందింది
  • అవినీతికి పరాకాష్ట ఎమ్యెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
  • మహిపాల్ రెడ్డికి ఈ పదేళ్లలో వేల కోట్లు ఎలా వచ్చాయి.?
  • భూకబ్జాదారు మహిపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి
  • తీవ్ర విమర్శలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • ప్రజా ఆశీస్సులతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా: కాట శ్రీనివాస్

పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి అత్యంత అవినీతిపరుడని, అక్రమంగా వేల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా.. రోడ్డుషో కార్యక్రమానికి హాజరై.. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్డుషోకు వేలాదిగా జనం తరలిరావడంతో..ఇస్నాపూర్ చౌరస్తా జనసంద్రంగా మారిపోయింది. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

పదేళ్లలో గూడెం మహిపాల్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడితో కలిసి చేసిన అక్రమాలు, అసైన్డ్ భూముల కబ్జాలు, రౌడీయిజాన్ని రూపుమాపుతామని హామీ ఇచ్చారు.. ఇందిరమ్మ పాలనలోనే పటాన్ చెరు అభివృద్ధి చెందిందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం పరిస్థి ఏంటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. 2014 కంటే ముందు మహిపాల్‌రెడ్డి ఆస్తులు, స్థితిగతులను పరిశీలించాలని ఆయన కోరారు. కాట శ్రీనివాస్‌గౌడ్ వైపు ధర్మం ఉంటే.. మహిపాల్‌ వైపు అధర్మం ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.. కాట శ్రీనివాస్‌కు అశేష జనాదరణ ఉందని, ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని రేవంత్ జోస్యంచెప్పారు. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో 9.30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని కోరారు.. మెదక్ పార్లమెంటు పరిధిలో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ అంటున్నాడని, కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకకు రోడ్లు, నీటి సౌకర్యంతో పాటు.. ఆయన చదువుకున్న బడిని సైతం కాంగ్రెస్ కట్టించిందంటూ చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉన్న ట్రిపుల్ ఐటీని కాంగ్రెస్ ఇచ్చిందని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చి.. ఓఆర్ఆర్, ఫార్మా కంపెనీలు, కృష్ణా, గోదావరి జలాలను తీసుకురావడం.. వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసింది కాంగ్రెస్ కాదా..? అంటూ రేవంత్ సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు చేసిన పటాన్ చెరులో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. మహిపాల్ రెడ్డికి డబ్బు మదం ఉంటే.. తనకు ప్రజాబలం ఉందన్నారు. పటాన్ చెరు ప్రజలకు ఆయన పాదాభివందనాలు తెలియజేశారు. కాంగ్రెసు కేడరే తనకు కొండంత బలమని.. వాళ్లే నన్ను ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రజా ఆశీస్సులతో పటాన్ చెరులో కాంగ్రెసు జెండా ఎగరేస్తానని కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ రోడ్ షోలో ఏఐసీపీ సెక్రటరీ విష్ణునాథ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, సంగారెడ్డి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు