Thursday, June 13, 2024

బీఆర్ఎస్ లోకి కాసాని తండ్రి, కొడుకులు

తప్పక చదవండి
  • నేడు ప్రగతి భవన్ సాక్షిగా ముహూర్తం ఖరారు
  • జంపింగులతో తెలంగాణ ఎన్నికల రాజకీయం వేడెక్కింది..
  • ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నేతలుగా జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు గుర్తింపు
  • వీరి చేరికతో బీఆర్ఎస్ నాయకులకు నూతనోత్సహం మొదలయ్యింది..
  • గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతీ వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్
  • కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు ఎలాంటి గౌరవం దక్కుందన్న దానిపై సర్వత్రా చర్చ

హైదరాబాద్ :- తెలంగాణ ఎన్నికల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏ నాయకుడి ఇంటిముందు ఏ రంగు జెండా ఉంటుందో నాయకుడి కుటుంబ సభ్యులే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సీటు ఇవ్వలేదని కొంతమంది నాయకులు .. ప్రాధాన్యత లేదని మరికొంతమంది నాయకులు ఇలా చెప్పుకుంటూ పొతే ఎదో ఒక కారణంతో నాయకులు రాత్రికి రాత్రే జెండాను మార్చేస్తున్నారు. తమ నాయకుల ఇంటిముందు ఏ జెండా ఉందొ కార్యకర్తలు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ లోని దిగ్గజాలు బీఆర్ఎస్ లోకి జారుకుంటుంటే.. బీఆర్ఎస్ లోని సీనియర్లు చేతు గుర్తును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎన్నికల వేడి అమాంతంగా పెరిగిపోయింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లోకి వెళ్లి లోకూర్చుంటే బీఆర్ఎస్ లోని సీనియర్ లీడర్ తుమ్మల హస్తం గూటికి చేరిపోయారు. ఇలా చప్పుకుంటూ పొతే చేరికల జంపింగుల లిస్ట్ చాంతాడే ఉంటుంది. దీనిలో ట్విస్ట్ ఏమిటంటే జంపింగులు చేసే వారిలో చాలామంది విత్ అవుట్ కమిట్మెంట్ జాయిన్ అవుతున్నారు.. వారు ఎన్నికల బరిలో నిలబడటం లేదు .. విచిత్రమేమిటంటే నిన్నటిదికా కడుపునిండారా తిట్టిన నాయకుడినే పొగుడుతూ అతనికే ఓటేయమని ప్రచారం చేయడం కొసమెరుపు..

బీఆర్ఎస్ లోకి కాసాని తండ్రి, కొడుకులు
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని ఆదినుంచి వ్యతిరేకించిన టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ , టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్ లు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రెండురోజుల క్రితం రాజీనామా చేసి తమ అసమ్మతిని తెలియజేశారు. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ లు ఈ నిర్ణయాన్ని సమర్ధించిన లేక ఆమోదించిన దాఖలాలు కనబడలేదు. మొన్నటివరకు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విభిన్న పరిస్థితుల నేపథ్యంలో జైలులో ఉన్నారు. మంగళవారం ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ ను బాబుకు న్యాయస్థానం ఇచ్చింది. దీంతో బాబు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన బాబు విషయం తెలుసుకుని కాసాని గురించి అరా తెస్తారని అంతా అనుకున్నారు. చంద్రబాబు పెట్టిన మీడియా సమావేశంలో కొన్ని మాటలైనా కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేశ్ ల గురించి మాట్లాడుతారని అంతా భావించారు.. కానీ బాబు, లోకేష్ లు ఎక్కడ కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేశ్ ల రాజీనామా ప్రస్తావన తేలేదు..దీంతో ఎట్టకేలకు కేసీఆర్ ఆహ్వానం మేరకు మెదక్ ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన పుట్టి రాజు తో పాటు మరికొంతమంది నాయులతో కలిసి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు ఎలాంటి గౌరవం దక్కుందన్న దానిపై సర్వత్రా చర్చ
టీటీడీపీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచి పెట్టుకుని పోయింది.. దాంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ లు తెలంగాణ రాష్ట్రంపై
ఆశలు కూడా వదులుకున్నారు . ఆ సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చూపు కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లపై పడింది.. అదే అదనుగా వారిని టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు ఫై అపారమైన గౌరం ఉన్నందున కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లు ఆయన మాటలను గౌరవించి తెలంగాణ టీడీపీ భాద్యతలు స్వీకరించారు..టీడీపీ భాద్యతలు చేపట్టిన అనంతరం కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లు ప్రతీ ఇంటికి టీడీపీ జెండా పేరుతొ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు .. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన కమీటీలను వేశారు.. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదు అన్న నోళ్లతోనే సభలు సమావేశాలు పెట్టి
జయహో అనిపించారు.. అంతా బాగుంది అనే సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జైల్లో కి వెళ్లడం జాతీయ అధ్యక్షుడి నిర్ణయాలను లోకేష్ తీసుకోవడం.. కాంతమంది అభిప్రాయాలకు తలొగ్గి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం లేదని తెగేసి చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లు టీడీపీ కి రాజీనామా చేశారు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా బీఆర్ఎస్ లోకి కాసాని తండ్రి, కొడుకులు చేరడం చర్చకు దారీ తీసింది. ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నేతలుగా జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు చక్కటి గుర్తింపు ఉంది.అయితే వీరి చేరికతో బీఆర్ఎస్ నాయకుల్లో నూతనోత్సహం మొదలయ్యింది.. .. అయితే గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతీ వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు ఎలాంటి గౌరవం ఇస్తారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలయ్యింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు