Sunday, May 12, 2024

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..

తప్పక చదవండి
  • 677 పోస్టులకు అనౌన్స్ మెంట్..
  • నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

న్యూ ఢిల్లీ : సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎంటీఎస్ పోస్టుల‌కు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే.. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టుల‌కు డ్రైవింగ్ లైసెన్స్‌, ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం అనుభవం కలిగి ఉండాలి. పోస్టుల‌ను బట్టి టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ ఆన్‌లైన్‌లో అక్టోబ‌ర్ 14 నుంచి ప్రారంభంకాగా.. న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు అప్లయ్‌ చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 677.. పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్.. అర్హ‌త‌లు : ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎంటీఎస్ పోస్టుల‌కు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే.. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టుల‌కు డ్రైవింగ్ లైసెన్స్‌, ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.. ఎంపిక : టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. వ‌య‌స్సు : 18 నుంచి 27 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. దరఖాస్తుకు చివ‌రి తేదీ : న‌వంబ‌ర్ 13.. పే స్కేల్: ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700- రూ.69,100. ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000 – రూ.56,900 వ‌ర‌కు. ద‌ర‌ఖాస్తు ఫీజు : రూ.500 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్. వెబ్‌సైట్ : www.mha.gov.in లేదా www.ncs.gov.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు