Sunday, April 28, 2024

అద్భుతాల ఆవిష్క‌ర‌ణ..

తప్పక చదవండి
  • ఏ 1 ని ఆర్ట్ తో మిళితం చేయడమే..

న్యూ యార్క్ : లాస్ఏంజెల్స్‌లో అడోబ్ మ్యాక్స్ 2023 వేదిక‌గా అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ అద్భుత ఏఐ ఫీచ‌ర్స్‌ను ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. క్రియేటివిటీని ఏఐ మింగేస్తుందా అన్న హాట్ డిబేట్ సాగుతుండగా క్రియేటివ్ ప్రొఫెష‌న‌ల్స్ భ‌విత‌వ్యంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. అయితే అడోబ్ వార్షిక స‌ద‌స్సుకు హాజ‌రైన ప‌లువురు ఆర్టిస్టులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏఐ టూల్స్ త‌మ స‌మ‌యాన్ని ఆదా చేస్తాయ‌ని, వీటిని స‌రైన విధంగా వాడితే అద్భుత విష‌యాల‌ను ఆవిష్క‌రించ‌డంలో త‌మ‌కు స‌హ‌క‌రిస్తాయ‌ని ఆర్టిస్టులు చెబుతున్నారు. ఆర్టిస్‌కు ఏఐ తోడైతే అది బెస్ట్ కాంబినేష‌న్ అవుతుంద‌ని ఒడిషా, బ‌లిప‌డకు చెందిన చైల్డ్ ఫొటోగ్రాఫ‌ర్ స‌త్యం భుయన్ పేర్కొన్నారు.

ఆర్ట్‌, ఏఐ రెండూ వేర్వేరు విష‌యాల‌ని, వీటిని మీరు క‌లిపితే మీ ప‌నులు మ‌రింత మెరుగ్గా చ‌క్క‌బెట్ట‌వ‌చ్చ‌ని ఆరేండ్ల కింద‌ట ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన స‌త్యం చెప్పుకొచ్చారు. దీనికోసం మీరంతా న్యూ సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్ కావ‌డం, ప్రాక్టీస్ చేయ‌డం, ఏఐ, ఆర్ట్‌ను మేళ‌వించ‌డం చేయాల‌ని సూచించారు. స్ట‌న్నింగ్ ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేసే సామ‌ర్ధ్యం ఏఐకి ఉంద‌ని ఓపెన్ఏఐ డాల్‌-ఈ, మిడ్‌జ‌ర్నీ చూపాయ‌ని గుర్తుచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు