Monday, May 6, 2024

చంద్రబాబుకు బదులు నన్ను జైల్‌ పెట్టండి : మాగంటి బాబు

తప్పక చదవండి

ఏలూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బదులు తనను రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మాగంటి బాబు అన్నారు. శనివారం నాడు నూజివీడులో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ ‘‘నాకు రాత్రి నిద్రిస్తుండగా కలలో స్వర్గీయ రాజశేఖరరెడ్డి ప్రత్యక్షమయ్యి కొడుకు జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తనపై తీవ్రంగా బాధ పడ్డాడు. తండ్రి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి సమయంలోనూ, భర్త ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనూ ఏనాడూ ఇంటి గుమ్మం దాటకుండా సేవా కార్యక్రమాలకే పరిమితమైన నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వచ్చారు. నారా భువనేశ్వరికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడుకు బదులు తనను జైల్లో పెట్టాలని జగన్‌ను కోరుతున్నాను. రాత్రి నిద్రలో రాజశేఖరరెడ్డి కలలో కనిపించి, తండ్రి వయస్సులో ఉన్న చంద్రబాబు నాయుడుపై తన కొడుకు ప్రవర్తిస్తున్న తీరును తప్పు అని చెప్పి మంచి చెడులు సూచించాలని తనను కోరారు’’ అని మాగంటి బాబు ఎద్దేవ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు