Wednesday, May 15, 2024

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ

తప్పక చదవండి
  • గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ విడుదల
  • ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన వికాస్‌ రాజు
  • అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం గెజిట్‌ను గవర్నర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సైతం గవర్నర్‌కు సీఈవో అందించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పడినటయ్యింది. మంత్రివర్గ సిఫారసు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ రద్దు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్‌ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్‌ రాజ్‌ గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ అసెంబ్లీ రద్దు ప్రతులను గవర్నర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి అందజేశారు. ఢల్లీి నుంచి పేర్లు వచ్చిన తరవాత సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్‌కుష అతిథి గృహానికి వాహనాలను తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. అధికారులు పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. గ్రౌండ్‌ ప్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. సీఎం ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగనున్నది. కాంగ్రెస్‌ బృందం సైతం గవర్నర్‌ను కలువనున్నది. కాంగ్రెస్‌ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్‌ సీఎం హోదా ఇచ్చి గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీని సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఎమ్మెల్యేలతో సమావేశమైంది. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ను సోమవారం ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ కలిశారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జామితాను గవర్నర్‌ కు అందజేశారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది.. పార్టీ అధిష్టానం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఢల్లీి ఏఐసీసీకి పంపారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. ఏఐసీసీ నిర్ణయం ప్రకారం సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేతగా, సీఎం అభ్యర్థిగా దాదాపు రేవంత్‌ రెడ్డి పేరు ఖారారైనట్లు తెలుస్తోంది.. సీఎల్పీ నాయకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యేలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. అయితే, ఎల్పీ సమావేశం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ జరుగుతున్నది. హోటల్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇందులో కీలక నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఉన్నారు. నలుగురు నేతలు సమావేశం నుంచి ఎందుకు బయటకు వెళ్లిపోయారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు