Wednesday, September 11, 2024
spot_img

సాగునీటిని విడుదల చేసిపంట పొలాలను కాపాడాలి

తప్పక చదవండి
  • రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కు వినతి

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ కార్యదర్శి టి సాగర్‌ నాగార్జునసాగర్‌ ఎడమకాల ఆయకట్టు పరిధిలో నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలలో వరి పంటలు సాగు చేశారని సాగునీటి విడుదల అవుతుందని ఆశతో కొందరు బోర్లు బావుల కింద మరికొందరు పంటలు సాగు చేశారని మంత్రికి వివరించారు. మొత్తంగా 30% మేరకు పంటలు సాగు అయ్యాయని ఇప్పుడు చేతికి వచ్చే సమయంలో సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు బావులు ఎండిపోయాయని తెలిపారు. సాగర్‌ ప్రాజెక్టు నుండి 15 టీఎంసీలు నీటిని వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు 10 రోజులపాటు నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించుకొని పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. స్పందించిన మంత్రి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వారి వెంట ఆ సంఘం సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు