Tuesday, May 7, 2024

సంఫీుభావంతో మానవ సమస్యలకు సమాధానాలు

తప్పక చదవండి

పేదరికం, ఆకలి కేకలు, అవిద్య, ప్రజారోగ్యం, అసమానతలు లాంటి సమస్యల పరిష్కారానికి మానవ సమాజం ఏకం అవుతూ, వాటిని తరిమేయడానికి 8 బిలియన్ల ప్రపంచ జనాభా ఏకతాటి మీదికి తీసుకురావడమే పౌరసమాజ కనీస లక్ష్యం కావాలి. సమాజ అవసరాలు తీర్చడం, ఏకాభిప్రాయంతో చేయూతను అం దించడం, ప్రయోజనాలను పొందడం, పేదరిక భూతాన్ని తరిమే యడం, సమాజ శ్రేయస్సు ఫలిచడం లాంటి అంశాల పట్ల మానవ సమూహాలు సమైక్యంగా పోరుచేయడాన్ని సంఫీుభావంగా అర్థం చేసుకోవాలి. ఐక్యత, సామరస్య సూత్రాలను ప్రకటించిన ఐరాస ‘మిలినియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ సాధనలో ప్రపంచ మానవ సంఫీుభావం ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయ పడుతు న్నది. అంతర్జాతీయ ఐక్యత, సమన్వయాలతో ప్రపంచ సమస్యల ను అధిగమించడానికి అవసరమైన సమిష్టి కృషిని చర్చించడానికి 2005లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట 20 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు ‘‘అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం (ఇంటర్నేషనల్‌ హుమన్‌ సాలిడారిటీ డే)’’ పాటిస్తూ ప్రపంచ సమస్యలకు, ప్రధానంగా పేదరికానికి సమాధానం వెతికే క్రమంలో ఏకతాటిపైకి వచ్చి సంఫీుభావం చూపడానికి దీనిని వేదికగా ఉపయోగిస్తున్నారు.
అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం-2023 నినాదం: అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం – 2023 నినాదంగా ‘‘మార్పు కోసం పోరు (అడ్వొకేట్‌ ఫర్‌ ఛేంజ్‌)’’ అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. దేశాల సరిహద్దులు మరిచి ప్రపంచాన్ని కుగ్రామంగా తలచి సోషల్‌ మీడియా, ఎన్‌జిఓలు, పౌరసమాజం వేదికగా పేదరిక నిర్మూలనకు సం బంధించిన అంశాలను, సలహాలను, సూచనలను, సహాయాలను, అవగాహనను, సమిష్టి ప్రయత్నాలను, అసమానతలు/ పేదరికాలను రూపుమాపడం లాంటి అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలకు ఈ వేదిక ఆస్కారం ఇస్తున్నది. మానవ హృదయం సహానుభూతిని శాశ్వత ఆభరణంగా ధరించి సమన్వయంతో తోటి సమాజ ఉన్నతికి ప్రతిన బూనాలని పిలుపు ఇస్తున్నది.
సమస్యల పోరుకు సంఫీుభావంతో సంఘటితం కావాలి: సంఫీుభావమే సమాజ పురోగతి, సంక్షేమ స్థాపనలకు ఊతమిచ్చే ఇంధనం కావాలి. రేపటి అభివృద్ధి చెందిన మానవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమస్త ప్రజానీకం సంఫీుభావం ప్రకటిస్తూ సమాధానాలు వెతకడమే తమ నిత్య మంత్రం కావాలి. మన ముందు కర్కశంగా కరాళనృత్యం చేస్తున్న పేదరికమే మన ప్రథమ శత్రువు అని భావించి, దానిని తరిమేయడానికి అందరం చేయి చేయి కలిపి, గళం విప్పి సంఫీుభావంతో సుదీర్ఘ పోరు చేస్తూ మెరుగైన ఫలితాలను సాధించడమే అంతర్జాతీయ మానవ సంఫీు భావ దినం వేదికను లక్ష్యంగా వాడు కోవా లి. వైవిధ్యభరిత అంతర్జా తీయ సమా జంలో మానవీయ కోణంతో తోటి వారికి చేయూతను ఇవ్వడం, సమన్యాయ వ్యవస్థ లను నెలకొల్పడం పౌరసమాజ బాధ్య త కావాలి. నేను, నాకు అన్న స్వార్థ భావన ను మరిచి మనం అన్న నినాదం పైకి రావాలి. ఒక్కొక్కరు చేసేది బిందు సమానమని, అం దరం కలిస్తే సాగరమంత సాఫల్యత సిద్ధిస్తుందని మరువరాదు. పొరుగు వారి ఉన్నతితోనే మన ఉత్తమ వ్యక్తిత్వం ప్రకటితం అవుతుందని మరువ రాదు. దాతృత్వ గుణాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద కార్య కర్తగా ముందుండడం, సకారా త్మక మార్పుకు పూనుకోవడం, సమాజ ఉన్నతి కార్యక్రమాలను చేపట్టడం, ప్రపంచ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించడం లాంటి అం శాలు ప్రతి ఒక్కరి నిత్య సూత్రాలు కావాలి. సమస్యలే కనిపించని సమ సమాజ స్థాపనకు మానవ సంఫీుభావమే ఒక దివ్య ఔషధం కావాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు