Tuesday, May 14, 2024

గ‌డీల పాల‌న‌లో అన్నీ గాయాలే

తప్పక చదవండి
  • తెలంగాణాలో అవినీతిపరుల ఆట కట్టిస్తాం
  • కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు
  • రామమందిర నిర్మాణం కాంగ్రెస్ వల్ల సాధ్యమయ్యేదా?
  • మోడీ పాలనలో సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది
  • బీజేపీ ని గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం..
  • ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్

బ‌లిదానాల సాక్షిగా ఏర్ప‌డిన తెలంగాణ‌లో గాయాలు త‌ప్ప ఇంకేమీ మిగ‌ల లేద‌ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అన్నారు. మాయ మాట‌ల‌తో జ‌నాన్ని బురిడీ కొట్టించ‌డం త‌ప్ప సీఎం కేసీఆర్ రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు చేసిందేమి లేద‌ని మండిపడ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. దొర‌, గ‌డీల పాల‌న‌ను తెలంగాణ ప్రజలు త‌ట్టుకోలేక పోతున్నార‌ని ఆవేద‌న చెందారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వచ్చాక మాఫియాలకు అక్రమ దందాలను బుల్డోజర్​తో తొక్కిపడేశామని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు ఉండేవని మోదీ అధికారంలోకి వచ్చాక అవేవీ లేవని ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. భారత్​పై దాడికి, చొరబాట్లకు ఎవరూ సాహసించరని, ఒకేవేళ చేస్తే మెరుపుదాడులు చేసి బదులిస్తామని వారికి తెలునని వివరించారు. సరిహద్దుల రక్షణను బలోపేతం చేయడంతో పాటు దేశంలో మౌలికల వసతుల కల్పనకు ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పేపర్ లీకేజీల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోతోందని.. యూపీలో ఆరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి మాత్రమే పెద్దపీట వేశారని, సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్ నినాదంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిర నిర్మాణం జరిగేదా అని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు. వీఆర్ఎస్​కు సమయం వచ్చిందని.. అందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ల ఉమ్మడి స్నేహితుడు ఎంఐఎం అని.. ముగ్గురు ఒకే తానులోని ముక్కలుగా అభివర్ణించారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా ముగ్గురికీ వేసినట్లేనన్నారు.

పాలమూరులో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అందించటానికి ఏపీ మిథున్ రెడ్డి కృషి చేస్తారన్నారు. నితిన్ రెడ్డిని గెలిపించిన వెంటనే జనవరిలో ప్రారంభమయ్యే అయోధ్య రామ మందిరం దర్శనానికి ఆలమూరు నుండి అత్యధికంగా కార్యకర్తలను ప్రజలను తీసుకువెళ్లడానికి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతుందని చేశారు. పాలమూరులో అరాచక పరిపాలన కొనసాగుతుందని వాటి అన్నింటికీ చరమగీతం పాడాలంటే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలను కోరారు. పాలమూరు గతంలో మహబూబ్నగర్ అనే పేరుతో మార్చారని మహబూబ్నగర్ పేరు తొలగి అధికారంలోకి వచ్చాక మహబూబ్నగర్ను ఆలమూరు పేరుగా మారుస్తామన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు పట్ల ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి గతంలో ప్రభుత్వ పాలనను కమిషన్ల పద్ధతిగా పనిచేశాలన్నారు. ప్రస్తుతము నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి రహిత పరిపాలన అందిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని సామాన్యులకు సైతం సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తుందని రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కారు వస్తే గమనించండి అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నారు. ఇక్కడ చూస్తే ప్రజల్లో ఉత్సాహం బిజెపికే ఉందని కనిపిస్తుంది ఇదే ఉత్సాహంతో ఏపీ మిథున్ రెడ్డికి ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని సూచించారు. పాలమూరులో ప్రతి ఒక్కరు కమలం గుర్తుకు ఓటు వేస్తే రామరాజ్యం సాధ్యమవుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జడ్చర్ల అభ్యర్థి చిత్తరంజన్ దాసు, దేవరకద్ర నియోజకవర్గం కొండ శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు