Thursday, May 2, 2024

దేశం కోసం.. ధర్మం కోసం.. బీజేపీకే మా ఓటు

తప్పక చదవండి
  • బండి సంజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం
  • గౌతమినగర్ లో ఇంటింటికీ తిరిగి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం

దేశం, ధర్మం కోసం ఈసారి కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కే ఓటేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రకటించింది. కరీంనగర్ లోని 10 వేల మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులంతా ఈసారి బండి సంజయ్ కే పూర్తి మద్దతు తెలిపేందుకు సంసిద్దంగా ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు ఫోరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నర్సింహారెడ్డి, అనిల్ కుమార్ ఈరోజు బండి సంజయ్ కు లేఖ రాశారు. ‘‘నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశం సంక్షేమ పథకాలతో రామరాజ్యంలా ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ వైఫల్యాలవల్ల ప్రజలు బీఆర్ఎస్ పట్ల విముఖతతో ఉన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతో సాధ్యమని ఆకాంక్షిస్తూ దేశం, ధర్మం కోసం కరీంనగర్ లోని 10 వేల మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులంతా మీకు మద్దతు ఇచ్చేందుకు పూర్తి సంసిద్దతను తెలుపుతున్నాం’’అని పేర్కొన్నారు. మరోవైపు ఉదయం బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం అంబేద్కర్ స్టేడియంతోపాటు ఎల్ ఎండీ డ్యాం వెళ్లారు. అక్కడ వాకర్స్ ను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు వాకర్స్ బండి సంజయ్ కు బాహాటంగానే మద్దతు తెలిపారు. ‘‘గత నాలుగేళ్లుగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నరు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులుసహా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి పక్షాన అనేక ఉద్యమాలు చేస్తూ తెలంగాణకు ప్రశ్నించే గొంతుకగా మారారు. మేం ఎక్కడికి వెళ్లినా కరీంనగర్ అని చెబితే.. మీ పోరాటాలను ప్రస్తావిస్తూ శభాష్ అంటుంటే గర్వపడుతున్నాం… మీలాంటి ప్రశ్నించే గొంతుకను కాపాడుకుంటాం. మా ఓటు మీకే…’’ అంటూ భరోసా ఇవ్వడం గమనార్హం. అనంతరం కరీంనగర్ లోని గౌతమ్ నగర్ వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు. స్థానికంగా నిర్మిస్తున్న అమ్మవారి ఆలయ పనుల పురోగతిని పరిశీలించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు