Thursday, May 16, 2024

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

తప్పక చదవండి
  • ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను కాజేసిన కేసీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు
  • సామ రంగారెడ్డి కి మద్ధతుగా యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవే రలేదని, మిగులు బడ్జెట్​తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఎల్బీనగర్ లో సామ రంగారెడ్డికి మద్ధతుగా కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఆధ్వర్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ దేశాలు గౌరవిస్తూ కొనియాడుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో భారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాలు లీకై ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో యువకులు తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. కార్పొరేట్ ఎన్నికల్లో నగరానికి వచ్చానని, అప్పుడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచి హైదరాబాదులో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నేడు మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో నగరానికి రావడం జరిగింది అని, హైదరాబాద్ నగరం అంటే మాకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ సభకు వేలాదిగా ఎల్బీనగర్ ప్రజలు యోగి సభకు తరలివచ్చి సభను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ , రాష్ట్ర నాయకులు, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అందరు బీజేపీ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, నియోజకవర్గం కన్వీనర్, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు