Sunday, May 19, 2024

పేదోళ్లు ఉద్యమం చేస్తే..పెద్దోళ్లు రాజ్యం ఏలుతుండ్రు

తప్పక చదవండి
  • బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి
  • గంగుల కమలాకర్‌ ఏం చేసాడో ప్రజలకు చెప్పాలి
  • పిల్లలకు, యువకులకు గంజాయి అలవాటు చేసిండు
  • నన్ను ఓడించేందుకు రూ.1000 కోట్లు ఖర్చు..?
  • నా కోసం కొట్లాడలే… మీకోసం కొట్లాడి జైలుకుపోయిన
  • బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని… ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్‌ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గల్లీలో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు. పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారని.. అందుకే బీసీ ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలని.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ కోరారు. శ్మశాన వాటికల్లో గడ్డి పెరిగిందని దొంగ బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న
నీచులని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు భూకబ్జాలు, అవినీతికి పాల్పడటం తప్ప చేసిందేమీ లేదన్నారు. పొరపాటున ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్తం తాగుతారని అన్నారు. ఓడిపోతాననే భయంతో ఒవైసీ వద్దకు పోయి మోకరిల్లి పచ్చ జెండా పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పొరపాటున బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గెలిస్తే బొట్టుపెట్టుకుని కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంకుగా మారి పువ్వు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బుద్ది చెప్పాలని కోరారు.

ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్‌ ఈరోజు భగత్‌ నగర్‌, రామచంద్రాపూర్‌, అంజనాద్రి కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘కరీంనగర్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల, అక్రమ దందా, అవినీతి లొల్లి.. ఇసుక కుప్పలు కన్పిస్తే డబ్బులు వసూలు చేస్తున్నరు. ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేస్తున్నరు. నేను ఎవరి భూములను కబ్జా చేయలే. అవినీతికి పాల్పడలే.. ప్రజల కోసం పోరాడే మనిషిని. నన్ను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తా.. కరీంనగర్‌ ప్రజలకు సేవ చేసుకుంటా. అవినీతి, అక్రమార్కుల సంగతి తేలుస్తా. మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలకు భావించే రకం బీఆర్‌ఎస్‌ నాయకులు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేను నిధులు తీసుకొస్తే.. కనీసం నన్ను పిలవకుండా కొబ్బరికాయకొట్టి తానే నిధులు తెచ్చినట్లుగా ఫోజులు కొడుతున్నడు. ప్రజలంతా అమాయకులు ఏదైనా నమ్ముతారనుకుంటున్నడు. మీ దమ్ము చూపండి. పువ్వు గుర్తుపై ఓటేసి గుద్దితే బీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కావాలె. గంగుల కమలాకర్‌కు మూడుసార్లు ఓట్తేస్తే ఎన్నడైనా ఇక్కడి ప్రజల గురించి ఆలోచించారా..? దోచుకోవడం దాచుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే మీకోసం యుద్దం చేసిన. మీకు డబుల్‌ ఇండ్లు ఇస్తే నేనెందుకు కొట్లాడతా.

- Advertisement -

మీ పిల్లలకు ఉద్యోగాలిచ్చారా? ఒక్కరికైనా ఇవ్వలేదే… వాళ్ల కోసం నేను కొట్లాడితే నన్ను అర్ధరాత్రి గుంజుకపోయి జైల్లో వేసిర్రు. రైతుల కోసం కొట్లాడిన. ఉద్యోగుల కోసం పోరాడిన. నేను నాలుగున్నరేళ్లుగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నా. నేను నా కోసం కొట్లాడలే. నా కుటుంబం కోసం జైలుకుపోలే… మీకోసం కొట్లాడి జైలుకుపోయిన. ఆలోచించండి.
గంగుల కమలాకర్‌ ఇప్పటికే పిల్లలకు, యువకులకు గంజాయి అలవాటు చేసి మత్తులో ముంచుతున్నడు. కుటుంబాల్లో చిచ్చు పెట్టిండు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో లక్ష సెల్‌ ఫోన్లు తీసుకొచ్చి పంచేందుకు సిద్ధమైండు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యిండు. నన్ను ఓడిరచేందుకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గంగుల గుర్తుంచుకో.. నువ్విచ్చే పైసలు తీసుకుంటరు. సెల్‌ ఫోన్లు తీసుకుంటరు. నువ్వు చేసే అరాచకాలను ఆ సెల్‌ ఫోన్లలో తీసి బయటకు పంపుతరు. నిన్న ఓడిరచడం ఖాయం..’’ అని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు