Saturday, May 11, 2024

మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను

తప్పక చదవండి
  • వెంకన్న సాక్షిగా చెబుతున్న హరీష్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తా …
  • హరీష్ రావు మెదక్‌లో ఎందుకు పెత్తనం చలాయిస్తున్నడు..!
  • ఆయన గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నడు
  • మల్కాజిగిరిలో తాను..తన కుమారుడు మెదక్‌లో పోటీ
  • మంత్రి కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి ..!
    హైదరాబాద్ :- బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఈ రోజు మద్యాహ్నం విడుదల చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ కాగా.. మరి కొద్దీ నిమిషాల్లో తెలంగాణ భవన్‌ వేదికగా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరని ప్రశ్నించారు. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
    హరీష్ గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నడు
    హరీష్ రావు గతం గుర్తించు కోవాలి. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తూ ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నాడు . హరీష్ అక్రమంగా లక్ష ల కోట్లు సంపాదించాడు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాను.ఆయన రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు. మెదక్‌లో నా తనయుడు.. మల్కాజిగిరిలో నేను పోటీ చేస్తాను. మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను..ఉంటాను కూడా .. నాకు ఆ పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది. వారి కుటుంబంలో కూడా చాలా మందికి టికెట్ ఇచ్చారు. మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం.” అని మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు.
    మైనంపల్లి కామెంట్స్ బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
    గత కొన్నాళ్లుగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.మెదక్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడిక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌కు నియోజకవర్గంలో మైలేజ్ పెరిగింది. ప్రజలు అక్కడి నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు కూడా అయితే ప్రజాక్షేత్రంలో నిర్విరామంగా సేవలు అందిస్తున్న తన కుమారుడిని కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంపై హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తొలుత తన కుమారుడికి టికెట్ వస్తుందని హన్మంతరావు ఆశించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మా దేవెందర్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా ఆమే అక్కడి నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తుండటంతో మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుపై ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ మైనంపల్లి కామెంట్స్ బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు