Thursday, May 2, 2024

మా అమ్మ నేర్పిన సంష్కారం

తప్పక చదవండి
  • మంచి చేయడం, సమాజ సేవ చేయడం ఆమె నుంచే నేర్చుకున్న
  • తెలంగాణలో తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీర్చి దిద్దుతా..!
  • బీసీల హక్కులను కాపాడటం కోసమే నా జీవితాన్ని త్యాగం చేశా
  • ప్రతీ గ్రామంలో, మండలంలో టీడీపీ జెండాను ఎగురవేయడమే నా లక్ష్యం
  • బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయ్యి దేశం మొత్తం చుట్టేసినప్పుడు
    తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎందుకు పరిపాలన చేయకూడదు ?
  • దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం తెరాస అబద్దాలను ప్రచారం చేసింది
  • ప్రజలారా ఇకనైనా మేల్కోండి.. తీర్పును టీడీపీకి కానుకగా ఇవ్వండి

ఒక క్రమిశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించడం తన తల్లి నుంచి నేర్చుకున్నాని టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చిన ఆయన బీసీల హక్కులను కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని అన్నారు. ఎన్నో అవకాశాలు ఊరించిన బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడా … రాజీ పడలేదని అన్నారు. రాజకీయాలు తనకు కొత్తకాదని పేర్కొన్న ఆయన నేడు రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ అంటే టీడీపీ, టీడీపీ అం టే తెలంగాణ అనే స్థితికి నేడు తెలంగాణ పార్టీ వచ్చిందని అన్నారు కాసాని.. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయ్యి దేశాన్ని చుట్టేసినప్పుడు తెలంగాణలో టీడీపీ ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు ? టీడీపీ తెలంగాణలో అంతరించిపోయిందని ప్రచారం చేస్తున్న పార్టీలకు కాసాని జ్ఞానేశ్వర్ సవాలు విసిరారు. ధనబలం లేకుండా అభ్యర్థులను ప్రలోభ పెట్టకుండా.. న్యాయపద్ధతిలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించి, టీడీపీ అభ్యర్థులపై గెలిచి చూయించాలని సవాలు విసిరారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకువెళుతుందని అన్నారు.. నేతలు పార్టీలు వీడినా.. క్యాడర్ పార్టీతోనే ఉందని స్పష్టం చేసిన అయన అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఒక బలమైన శక్తిగా మారుతుందని జోస్యంచెప్పారు.. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబునాయుడి విజన్ కారణమని అన్నారు. గ్రామ గ్రామాన తిరిగి తెలుగుదేశం జెండాను పునః స్ధాపిస్తానని, పార్టీని వీడిన నాయకులందరూ తిరిగి తెలుగుదేశంలో చేరాలని ఆయన కోరారు.

- Advertisement -

మంచి కంటే చెడు త్వరగా ప్రజల్లోకి వెళ్లుతుంది :
మంచి కంటే చెడు త్వరగా ప్రజల్లోకి వెళ్లుతుందని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ప్రజలు నీతి తప్పిన కొందరు నాయకులకు అవకాశాలు ఇవ్వడంతోనే రాజకీయాలు కృశించిపోయాయని అన్నారు..తొలుత టీడీపీ ఆంధ్రా పార్టీ అని ముద్ర వేశారని. అదే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పార్టీ ఎలా రాజకీయాలు చేస్తుందని ప్రశ్నించారు. అప్పుడు తప్పయింది నేడు ఎలా ఒప్పయిందని అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పు డు హైదరాబాద్ నడిబొడ్డున పుట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.. కొందరు కావాలనే కుట్ర పూరితంగా టీడిపిపై ఆంధ్ర పార్టీ ముద్రవేశారని ఆరోపించారు. గతంలో 93 కుల సంఘాల చైర్మన్ గా, పార్టీ స్థాపిం చిన అధినేతగా తనుకన్న అనుభవంతో తెలంగాణలో టీడీపీని ముందుకు తీసుకెళ్తున్నానని అన్నా రు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు