Saturday, May 4, 2024

టీమిండియా – ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం

తప్పక చదవండి
  • డబ్లిన్ లో తొలి టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసిన ఐర్లాండ్
  • లక్ష్యఛేదనలో 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేసిన భారత్
  • ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన క్రెయిగ్ యంగ్
  • తిలక్ వర్మ డకౌట్
    టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. 140 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 6.3 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసిన దశలో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. దాంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం పెరగడంతో పిచ్ ను కవర్లతో కప్పివేశారు.
    వర్షం పడే సమయానికి క్రీజులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 29, సంజు శాంసన్ 1 పరుగుతో ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేయగా, తిలక్ వర్మ (0) ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి, తిలక్ వర్మలను పెవిలిన్ చేర్చాడు.

టీమిండయా గెలవాలంటే ఇంకా 79 బంతుల్లో 93 పరుగులు చేయాలి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ కొనసాగించడం సాధ్యం కాకపోతే, డీఎల్ఎస్ ప్రకారం టీమిండియానే నెగ్గుతుంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి డీఎల్ఎస్ స్కోరు 45 పరుగులు అవసరం కాగా… టీమిండియా 47 పరుగులు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు