Friday, May 17, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు

తప్పక చదవండి
  • ప్రజలకు మంచి చేయాలనుకునే పేద, మధ్య తరగతి నాయకులు పోటీచేసే వీల్లేకుండా చేస్తున్నారు..
  • రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ ఎందుకు 99వేల 999లను వర్తింప జేయవ్?
  • రుణమాఫీ అందక ఇంకా 20 లక్షల మంది రైతులు అల్లాడుతున్నా పట్టించుకోరా?
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం
  • సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళి.. మొగల్ చక్రవర్తులను గడగడలాడించిన ధీరుడు సర్వాయి పాపన్న: బండి సంజయ్.

హైదరాబాద్ : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ఖరీదైన పార్టీలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గడువు ముగియక ముందే మద్యం దరఖాస్తు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే…. ఎమ్మెల్యే టిక్కెట్ కు దరఖాస్తు చేసుకునే నేతల నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు, సమాజానికి మంచి చేయాలనుకునే పేద, మధ్యతరగతి నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ శుక్రవారం రోజు కరీంనగర్ లోని అలుగునూరు బ్రిడ్జివద్దనున్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సమాజ పరిరక్షణ కోసం మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించి గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు. సమసమాజ స్థాపన సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరుడు. మొగల్ చక్రవర్తులకే ముచ్చెమటలు పట్టించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరేసిన కొదమ సింహం. ‘‘అమ్మా! తాటిచెట్టు ఎక్కను. లొట్టి పట్టను. గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగరేయడమే నా జీవిత ఆశయం’’ అని తల్లికి మాటిచ్చి అనుకున్నది సాధించిన మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆనాటి మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్ దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాలకు విసిగిపోయి ఎదిరించడానికి అతను చేసిన సాహసం ఎనలేనిది. ఒక్కనితో ప్రారంభమైన సర్దార్ పాపన్న పోరాటం సబ్బండ కులాల పీడిత ప్రజలను సమీకరించుకొని 12 వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. గెరిల్లా పోరాటాలు చేస్తూ తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులే. ఇద్దరూ సామాన్య కుటుంబంలో పుట్టినోళ్లే. మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న వాళ్లే. కానీ ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కకపోవడానికి రాష్ట్ర పాలకులే కారణం.

- Advertisement -

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కాస్ట్ లీ పార్టీలే. దరఖాస్తుల పేరుతో ఆదాయం దండుకునే పార్టీలే. గడువు ముగియకపోయినా మద్యం దరఖాస్తుల పేరుతో కేసీఆర్ రూ.2 వేల కోట్లు దండుకుంటుంటే…. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేల ఫీజు వసూలు చేల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీ డబ్బులు దండుకునే విషయంలో కేసీఆర్ తో పోటీ పడుతోంది. సమాజానికి సేవ చేయాలనుకునే పేదలు, మధ్య తరగతి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా కాంగ్రెస్ చేస్తోంది. అయినా డిపాజిట్లు రాని కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకునేదెవరు? డబుల్ బెడ్రూం ఇండ్ల డిమాండ్ పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు అలుగునూరు లో రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. పేదల సమస్యలను పరిష్కరించడం చేతగానికి కేసీఆర్… వారి తరపున పోరాడుతున్న కార్యకర్తలపై జులుం ప్రదర్శించడం సిగ్గు చేటు. రేషన్ కార్డుల్లేక జనం అల్లాడుతున్నరు. ప్రభుత్వ తీరువల్ల వారంతా ఆరోగ్య శ్రీసహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక దూరమైనరు. అలాంటి వాళ్ల ఉసురు కేసీఆర్ కు తగలక తప్పదు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 99 వేల 999 రూపాయల వరకు మాఫీ అంటూ బంపర్ ఆఫర్ పెట్టింది. రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిన ప్రభుత్వం 99, 999 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తుండటం సిగ్గు చేటు. ఇది దగాకారు ప్రభుత్వం. లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులు ఇంకా 20 లక్షల మంది ఉన్నారని, వారికి రుణమాఫీ వర్తింపజేయకుండా ఇబ్బంది పెట్టడం సిగ్గు చేటు… ఇది ముమ్మాటికీ రైతులను మోసం చేయడమే. కేసీఆర్ రైతు ద్రోహి. చరిత్రలో నిలిచిపోతాడు. తక్షణమే ఆయా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు