Wednesday, May 15, 2024

మంత్రిగా విడిచి వెళ్లారు.. మంత్రిగానే అడుగు పెట్టారు..

తప్పక చదవండి

చిట్యాల (ఆదాబ్‌ హైదరాబాద్‌): కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సాధన కోసం 2011 అక్టోబర్‌ 1 న తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన సెక్రటేరియట్‌ గడప తొక్కలేదు. నీళ్లు,నిధులు, నియామకాలు కావాలంటూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులవి.తెలంగాణ సాధించుకున్నాకే మళ్ళీసెక్రటేరియట్‌ లో అడుగు పెడుతాను అంటూ కోమటిరెడ్డి శపధం పూనారు. తన రాజీనామా పత్రాన్ని నేరుగా గవర్నర్‌ కే పంపారు.కోమటిరెడ్డి తో పాటు మొత్తం నలుగురు మంత్రుల పదవీ త్యాగంతో తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఊపు వచ్చింది. కోమటిరెడ్డి రాజీనామాతో ఆగలేదు. ఆమరణ నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో డిసెంబర్‌ 9 న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మహోన్నత ఉద్యమ ఫలితాన్ని టీ ఆర్‌ ఎస్‌ ఘనతగా క్రెడిట్‌ కొట్టేసి 2014 లో అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీ ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదు. వై ఎస్‌ ఆర్‌ హయాంలో కోమటిరెడ్డి చొరవతో మంజూరైన ూూదీజ ప్రాజెక్ట్‌ పూర్తి చేయమని కోరెందుకు ముఖ్యమంత్రి కే సి ఆర్‌ అప్పాయింట్మెంట్‌ అడిగినా ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయించు కున్నారు. ఇన్నాళ్లకు ఆయన శపథం నెరవేర్చుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్యాబినెట్‌ లో మంత్రిగా ప్రమాణం చేశారు. సెక్రటేరియట్‌లోని 5్‌ష్ట్ర ఫ్లోర్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ఆయన సంతకాలు చేశారు.ఇది తెలంగాణ కు నిజంగా మేలు మలుపు. ఆయన అభిమానులు ఇలాంటి మహోదయం కోసమే పుష్కర కాలం పాటు వేచి చూశారు. మంత్రిగా ఆయన సచివాలయం వదిలి వెళ్లారు.. మంత్రిగానే మళ్ళీ అడుగు పెట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు