- మాంగళ్య మాల్ బిల్డింగ్ పై ఎన్నో ఫిర్యాదులు..
- సీఎంఆర్ బిల్డింగ్‌కి సెల్లార్ అనుమతి లేదు..
- మెయిన్ రోడ్లపై దర్శనమిస్తున్న అనుమతికి మించిన కట్టడాలు..
- చూసి చూడనట్లు వదిలేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
- విశాల్ మార్ట్, టీవీఎస్ షోరూం, మమతా బ్యాంకేట్ హాల్ బిల్డింగ్‌లకు
- అక్రమ సెల్లార్ నిర్మాణం..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : సూర్యాపేట పట్టణంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అరకొర అనుమతులతో, పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేపడుతు న్నారు.నిర్మాణ దారులు అనుమతులు తీసుకునే ముందు ఒకలా గా, నిర్మాణం జరిగే సమయంలో మరొక విధంగా భవనల నిర్మా ణం చేపడుతున్నారు. పట్టణంలో రోజు పదుల సంఖ్యలో నిర్మా ణాలు జరుగుతున్నాయి. అందులో రెండు మూడు బిల్డిం గులు సెల్లార్ నిర్మాణంకి ఎలాంటి అనుమతులు పొందకుండానే సెల్లార్ ఏర్పాటు చేసి, నిర్మాణం చేపడుతున్నారు.ఈ అక్రమ నిర్మాణాల పై టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
అనుమతులకు మంగళం.. మాంగళ్య మాల్ భవనం..
పట్టణంలో నేషనల్ హైవే కి అనుకొని గత కొన్ని నెలల క్రితం 6 అంతస్తుల భవనం నిర్మాణం చేసిన చేశారు. ఆ భవనంలో గత కొద్ది రోజుల క్రితం మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఈ మాల్ ప్రారంభోత్సవానికి ఎమ్మేల్యే (మంత్రి) జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగ యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ ఇతర నాయకులు, సిని నటి సహా, పలువురు ప్రారంభించారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై ఎన్నో ఫిర్యాదులు రావడం తో పాటు, పలు పత్రికలలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి.అయినా అధికారులు ఎవరూ కూడా ఆ బిల్డింగ్ వైపు కన్నెత్తి చూసింది కూడా లేదు. ఎందుకంటే అది ఒక బిజినెస్ మ్యాన్,(గతం లో) అధికార పార్టీకి చెందిన నాయకుడు ది కావడం గమనార్హం. ఆ బిల్డింగు సెల్లార్ అనుమతి లేకపోగా,పై ఫ్లోర్ కూడా అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ కి చెందిన నాయకుడిది కావడంతోటే అధికారులు ఆ బిల్డింగ్ ను, ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అనుమతులు లేని సెల్లార్ ను మూసివేయాలని, అనుమతులు లేకుండా అదనంగా ఉన్న ఫ్లోర్ ను కూల్చివేయాలని పలువురు కోరుతున్నారు.ఆ పక్కనే ఉన్న సిఎంఆర్ మాల్ కూడా సెల్లార్ అనుమతి లేకపోవడం, ఈ నిర్మా ణం కూడా జరుగుతున్న సమయంలో అధికారులు ఎలాంటి ఆబ్జె క్షన్ చెప్పకుండా, కనీసం వారికి నోటీస్ కూడా ఇవ్వకుండానే నిర్మాణం సాఫీగా అయ్యేలా టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిం చాలని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ మాల్ ని కూడా ప్రముఖనాయకులు అందరూ హైజరై ప్రారంభించారు.
దర్జాగా మమత,విశాల్ మార్ట్ భవనాల సెల్లార్ నిర్మాణం…
పట్టణంలో మెయిన్ రోడ్లపై ఇంత పెద్ద భవనాలు నిర్మిస్తున్న ప్పటికీ అధికారులు అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విశాల్ మార్ట్ భవనం కి సెల్లార్ అనుమతికి సరిపోను స్థలం లేదు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. మమత హోటల్ మరియు లగ్జరీ రూమ్స్ కొరకు నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు.ఈ నిర్మాణం కూడా సెల్లార్ తో కలుపుకొని నిర్మాణం చేశారు.వీటితో పాటు టీవీఎస్ షోరూం పేరుతో మరొక నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టగా, ఆ నిర్మాణం కూడా సెల్లార్ తో నిర్మాణం చేశారు. అలాగే వాణిజ్య భవన్ సమీపంలో పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ప్రస్తుతం ఓ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం కూడా సెల్లార్ ఏర్పాటు చేసి ప్రస్తుతం జి ప్లస్ టు నిర్మాణం చేపట్టారు. అక్రమ సెల్లార్ ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ బిల్డింగ్ సంబంధించిన మెట్లు కూడా ఎలాంటి సెట్ బ్యాగ్ లేకుండా రోడ్డుమీదికి పోయడం పట్ల అటు వెళ్లే, పాదా చార్యులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుడ కుడ రోడ్డులోని బ్లూసి కేఫ్ పక్కన సెల్లార్ తో కలుపుకొని ఓ భవనం నిర్మాణం జరుగుతుంది. అదే రోడ్డులో పతినుము షాప్ పక్కన సెల్లార్ తో పాటు జి ప్లస్ త్రీ నిర్మాణం చెప్పటారు. ఈ నిర్మాణం చేపట్టింది (గతం లో) ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడిగా తెలుస్తుంది.అలాగే 60 ఫీట్ రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు కి సమీపం లో పెయింట్ షాప్ పెట్టిన భవనం కూడా సెల్లార్ తో భారీ నిర్మాణం చేశారు ఇలా అనుమతులు లేకుండా సెల్లార్‌లతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా.! అని పట్టణ ప్రజలు పలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో అనుమతులు లేని భవనాలు, అనుమతులకు మించి నిర్మాణం చేసిన భవనాలు, అక్రమ సెల్లార్ ల నిర్మాణం చేసిన నిర్మాణాలపై, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.