Thursday, May 16, 2024

రైతు వ్యతిరేకి కాంగ్రెస్

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ దోచుకోవడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు
  • కాళేశ్వరం జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేశాం
  • గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం
  • గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మరోమారు మోసానికి యత్నం
  • బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
  • చివరి రోజు ప్రచారంలో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం హోరెతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధికి పాటుపడిన ఘనత సీఎం కేసీఆరే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మల్లి కరెంటు కష్టాలు వస్తాయి.. గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని, కర్ణాటక ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పంటలను ఎండపెట్టి వలసబాట పట్టాల్సి వస్తదన్నారు. ధరణిని ఎత్తేసి రైతుల మధ్య భూ తగాదాలను పెట్టాలని చూస్తుందన్నారు.

నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తుర్కపల్లిలో 138 ఎకరాల్లో గ్రీన్‌ ఇండర్‌స్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలేరులో మహిళా ప్రాంగణం, ఆత్మకూర్ గుండాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం, రాజాపేటలో వృత్తి విద్యా కళాశాల, యాదగిరిగుట్టను పర్యటక కేంద్రంగా, అన్ని డివిజన్లలో యువజన, మహిళా వృత్తి నైపుణ్యం సెంటర్లు, ఆత్మకూర్ మండలంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు, బొమ్మలరామంలోని జూనియర్ కళాశాలను, సీనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం, ఆత్మకూర్ & మూటకొండూర్, రాజపేట్ రోడ్‌లోని సెంట్రల్ రోడ్ మరియు మూటకొండూర్ వెంబడి వీధి దీపాలను ఏర్పాటు, మల్లాపూర్, కొలనుపకలో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని తెలిపారు. ఎన్నికల అనంతరం పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 10 ఏండ్ల క్రితం ఏడారిగా మారిన ప్రాంతాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు కాళేశ్వరం జలాలను తెచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు