Friday, May 17, 2024

రూ.19.5 లక్షల విలువగల గంజాయి పట్టివేత

తప్పక చదవండి

కొత్తగూడెం : వాహనాల తనిఖీలో భాగంగా రూ.19.5లక్షల విలువ గల 78కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఎఎస్పీ పరితోష్‌పంకజ్‌ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం ఆర్‌టిఎ చెక్‌పోస్ట్‌, కూనవరం రోడ్డు వద్ద ఎస్‌ఐ పివిఎన్‌.రావు , అందాసు హరీష్‌లు బలెనో కార్లో 40కిలోలు, వెనుక వస్తున్న టాటా ఇండిగోకార్లో 38కిలోల గంజాయితో చిత్రకొండ, మల్కానగిరి జిల్లాకు చెందిన సంజీవ్‌కుమార్‌ భట్ర వద్ద ఆంధ్రా`ఒరిస్సా సరిహద్దుల్లో సీలేరు వద్ద కొనుగోలు చేసి హైద్రాబాద్‌లో విక్రయించడానికి అక్రమగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు టాటా ఇండిగో కారు దూకి పారిపోవడం జరిగిందని, వారి వివరాలు తెలుసుకోగా సీలేరుకు చెందిన పంగి బాబు,కూర పూర్ణ, సునీల్‌ అని తెలిసింది. ఈగంజాయిని హైద్రాబాద్‌లోని ఓల్డ్‌ సిటికి చెందిన నందక్క అనే మహిళకు అమ్మడానికి వెళ్తున్నట్లుగా నేరం ఒప్పుకోవడం జరిగిందని, కారుఓనర్లపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.78కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు సీజ్‌ చేయడం జరిగింది.భద్రాచలం టౌన్‌ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు