Sunday, May 19, 2024

నోటిఫికేషన్‌ ఓకే …. మరి పరీక్ష…

తప్పక చదవండి
  • మెడికల్‌ కళాశాల అవుట్‌సోర్సింగ్‌ నియామకాల్లో అవకతవకలు
  • ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.4లక్షలు వసూలు..?
  • అదనంగా మరో 10మంది నియామకం
  • 8నెలలుగా వేతనాలు చెల్లిస్తుంది ఎవరు..?
  • డిఎంఎల్‌టి పరీక్ష నిర్వహణలో ఇన్‌విజిలేటర్లుగా వ్యవహరించిన వైనం
  • అదనపు నియామకాలు తెలవదంటున్న ప్రిన్సిపాల్‌

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కళాశాలలో ఎవరి ఇష్టం వారిదే. ఎవరు నియామకాలు చేపడుతున్నారో.. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఎవరు నియమిస్తున్నారో ఎవరికి తెలి యని పరిస్థితి. ఔట్‌సోర్సింగ్‌ నియామకాలను ఏజెన్సీ విచ్చల విడిగా చేపడుతుంటే ఆవిషయాలు ప్రిన్సిపాల్‌కి కూడా తెలియ దంటా. నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించకుండా అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు చేపట్టినా పట్టించుకునే నాధుడే లేడు. ఈ కళాశాలలో ఏం జరుగుతుంది. అసలు సూత్రదారి ఎవరు. తెర వెనుక ఉండి నడిపించే ఆఘనుడు ఎవరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొ త్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సంవత్సరం క్రితం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు.ఆ నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటి వర కు ఎటువంటి పరీక్షను నిర్వహించలేదు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకపు బాధ్యతలను ఏజెన్సీకి అప ్పగించడంతో ఆ ఏజెన్సీ ఆడిరదే ఆట పాడిరదే పాటగా సాగుతుంది ఇక్కడ. నోటిఫికేషన్‌ జారీ అయిన తరువాత సుమారు జిల్లా వ్యాప్తంగా 8క్యాటగిరిలకు సంబంధించి 3200మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకు న్నారు. పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్న ప్పటికీ ఆ నిబంధనలు పాటించకుండా పరీక్ష నిర్వహించ కుండా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకున్నారు సదరు కాంట్రాక్టర్‌. ఈ నియామకాల్లో సుమారు ఒక్కొక్క అభ్యర్థి నుంచి నాలుగునుండి ఐదు లక్షల రూపాయలు ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పెద్దమొత్తంలో అవకతవకలు జరిగినా సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లు లేదు. అంటే తెర వెనుక ఉండి నడిపిస్తున్న ఆ వ్యక్తి ఏస్థాయిలో ప్రభావితం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే32మంది నియామకాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరి స్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత ఏజీన్సీ మరో 10మందిని ఈమధ్యకాలంలో నియమించుకుంది. ఈపది మంది వద్ద నుంచి కూడా పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విశ్వసనీ యసమాచారం. అయితే ఈ పదిమంది నియామకం తనకు తెలియదని ప్రిన్సిపాల్‌ చెప్పడం శోచనీయం. అయితే ఈమధ్యకాలంలో నియమించిన పదిమంది ఈనెలలో జరిగిన డిఎంఎల్టి పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. ఈ పదిమంది నియామకపు వ్యవహారం తెలియదు అంటున్న ప్రిన్సిపాల్‌ వీరిచే పరీక్ష నిర్వహణకు ఎలా చేయించారు అన్న అను మానాలు సర్వత్రావినిపిస్తున్నాయి. పదిమందికి తమ కళాశాల నుంచి ఎటువంటి జీతభత్యాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు ప్రిన్సిపాల్‌. సుమారు రెండు లక్షల రూపాయల వరకు నెలకు వీరికి వేతన రూపంలో 8నెలులగా చెల్లిస్తున్నారు సదరు ఏజెన్సీ. కళాశాల యాజమాన్యం చెల్లించుకుండా సదరు కాంట్రాక్టర్‌ ఏవిధంగా వీరికి వేతనం చెల్లిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈనియామకంతోపాటు చెల్లింపుల విషయంలో పెద్ద మతలబే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మెడికల్‌ కళాశాలలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జిల్లాకలెక్టర్‌ దృష్టి సారించాలని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఔట్‌సోర్సింగ్‌ నియామకపు నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష నిర్వహించి సిబ్బందిని నియ మించాలని కోరుతున్నారు నిరుద్యోగులు. మరి ఆదిశగా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్ధాం.
అదనపు సిబ్బంది నియామకం నాకు తెలియదు: ప్రిన్సిపాల్‌
8నెలల క్రితం అదనంగా పదిమంది సిబ్బంది అదనంగా నియమించిన విషయం తన దృష్టికి రాలేదని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌ఎల్‌.లక్ష్మణ్‌రావు ఆదాబ్‌హైదరాబద్‌కు వివరించారు.32మంది సిబ్బంది నియామకం తన పరిధిలోనిది కాదని గత కలెక్టర్‌ పర్యవేక్షణలో నియామకాలు జరిగాయని తెలిపారు.అదనంగా మరో పది మంది సిబ్బంది నియామకం జరిగి ఉంటే అటువంటివారిని ఎవరిని కళాశాలలోకి అనుమతించనని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు