Friday, May 17, 2024

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోంది

తప్పక చదవండి
  • బిఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు చరమగీతం ఖాయం
  • నోట్ల కట్టలతో గెలవాలనుకున్న వారికి ఓటమి తప్పదు
  • రైతుబంధుపై కావాలనే బిఆర్‌ఎస్‌ డ్రామాలు
  • ఖమ్మం ప్రచారంలో మాజీమంత్రి తుమ్మల

ఖమ్మం : తెలంగాణలో కాంగ్రెస్‌ సునావిూ రాబోతుందని ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని అన్నారు. తెలంగాన ఇచ్చిన సోనియాకు ప్రజలు జైకొట్టడం ఖాయమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం 20వ డివిజన్‌లో తుమ్మల రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించ బోతుందన్నారు. ఖమ్మంలో నలభై నుంచి యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్‌ జెండా ఎగరనుందని స్పష్టం చేశారు. నోట్ల కట్టలతో గెలవాలనుకునే వారు ప్రజా బలం ముందు ఓడి పోవాల్సిందే అని తెలిపారు. అవినీతి సొమ్ముతో అధికార మదంతో ఖమ్మం లో తిరుగుతున్నారని మండిపడ్డారు. అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలన్నారు. భూ కబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్‌ పార్టీనే గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం కెసిఆర్‌కు లేదని, అందుకే ఇసి అనుమతించినా చెల్లింపుల్లో ఆలస్యం చేసి, కాంగ్రెస్‌పై నెపం నెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. హరీష్‌ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించు కుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పదిహేను రోజుల్లో ఇచ్చిన హావిూ మేరకు డబ్బులను జమచేస్తుందని తుమ్మల అన్నారు. మంత్రి హరీశ్‌ రావు వల్లే రైతుబంధు ఆగిందని.. కాంగ్రెస్‌ వచ్చిన 15 రోజుల్లో పైసలిస్తమని తెలిపారు. రైతుబంధు పంపిణీకి ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతుబంధును పంపిణీ చేయకుండా నిలిపివేస్తే.. ఈలోగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించి నందుకు అనుమతి రద్దు చేసింది. ’రైతుబంధు’ నిధుల విడుదలకు ఈసీ అనుమతి వెనక్కు తీసుకున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ’రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశం లేదని తేలిపోయిందని అన్నారు. మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతి వెనక్కు తీసుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలివ్వడం దీనికి నిదర్శనం అన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప తెలంగాణలో రైతులకు న్యాయం జరగదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు