Saturday, April 27, 2024

దేవుడి భూమికే దిక్కులేదు.. !

తప్పక చదవండి
  • గణేష్‌ గుడికి కేటాయించిన భూమి స్వాహాకు కుట్ర..
  • ఆలయాల పేరుతో కబ్జాకు యత్నం..
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు..
  • పరారీలో కబ్జాకు యత్నించిన వ్యక్తి..
  • నేరచరిత్ర ఉన్నవ్యక్తి కావడంతో భయపడుతున్నకమిటీ సభ్యులు..
  • కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు..
    కొత్తగూడెం : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా, ఇతరులదా, దేవాలయ భూములా అనవసరం కబ్జా కోరులకు. ఇక ఆలయాల భూముల్కెతే ఆభూమిని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. కొత్తకొత్త పందాలో భూమిని స్వాహా చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఏదిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. కానీ ఇక్కడ ఆదేవునికే దిక్కులేకుండా పోయింది. గణనా ధుడికి కేటాయించిన భూమిని కాపాడుకోలేక ఆ బజ్జ గణపయ్య నాకెవ్వరు దిక్కు.. నా స్థలాన్నికాపాడేదెవరు అనుకునేటట్లు వ్యవహరిస్తున్నారు భూ బకాసురులు. ఆలయాల పేరుతో ఆలయాల భూములనే కాజేసేందుకు అక్రమార్కులు కుట్రలు చేస్తుండటంతో భక్తులు నివ్వెర పోవాల్సిన పరిస్థితి దాపురించింది. కబ్జాలకు పాల్పడుతున్నది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కావడంబతో ప్రజలతోపాటు, ఆలయ కమిటీసభ్యులు భయబ్రాంతులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిరది..

భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాకొత్తగూడెం నియోజకవర్గంలోని, కొత్తగూడెం బస్టాండ్‌ ఏరియా రైటర్‌ బస్తీ ఏరియాలో గత అనేక సంవత్సరాల క్రితం శ్రీగణేష్‌ ఆలయాన్ని సింగరేణి అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాల చేయూతతో నిర్మించారు. ఈ ఆలయ అవసరాల నిమిత్తం ధూప దీప న్కెవేధ్యాల కోసం బస్టాండ్‌ సమీపంలోని కొంత స్థలాన్ని జిఓ 514ద్వారా యాజమాన్యం కేటాయించింది. అయితే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో షాపు నిర్మించుకొని ఆలయానికి అద్దె చెల్లిస్తున్నారు. అదే విధంగా షాపులకు వెనుక వైపు ఉన్న1200గజాల స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా గణేష్‌ విగ్రహాల తయారీదారునికి అద్దెకిచ్చారు. అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆరోగ్యం బాగోలేక ఇక్కడి నుంచి ఖాళీ చేయగా.. ప్రస్తుతం స్థలం ఖాళీగా ఉంది. నేరచరిత్ర ఉన్న ప్రేమ్‌ అనే వ్యక్తికన్ను ఈస్థలంపై పడిరది.. ఎలాగైనా ఆస్థలాన్ని పూర్తిగా కబ్జా చేయాలని కొత్త ఉపాయంతో ఆలయానికి సంబంధించిన భూమిలో గురువారం రాత్రికి రాత్రే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు మొదలు పెట్టారు. దీంతో స్థానిక ప్రజలు గణేష్‌ ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇక చేసేది లేక శ్రీగణేష్‌ ఆలయ కమిటీ సభ్యులు1టౌన్‌ ఎస్‌హెచ్‌ఓను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆలయ భూమిని కాపాడాలని కోరారు. పోలీసులు ధర్యాప్తును ప్రారంభించడంతో పాటు కబ్జాకు ప్రయత్నించిన వ్యక్తి ప్రేమ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రేమ్‌ పరారీలో ఉన్నాడు. 1వటౌన్‌ ఎస్‌ఐ బి. శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఘనీలు సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులతోపాటు, స్థానికులు కబ్జాకు యత్నించిన విషయాలను పోలీసులకు వివరించారు. ఆలయాల భూమిని ఆలయాల పేరుతో కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని.. కబ్జాకు ప్రయత్నించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు.. అదే విధంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తి నుంచి తమను కాపాడాలని స్థానిక ప్రజలు, కమిటీసభ్యులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు