Tuesday, October 3, 2023

సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ భూ గద్దలకు రక్ష..

తప్పక చదవండి
  • వారిని కాపాడుతున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు…
  • నిబంధనల ప్రకారమే నిర్మాణ అనుమతులంటున్న వైనం..
  • జోనల్‌ అధికారుల ఆదేశాలతోనే ఈ తతంగం..
  • చర్లపల్లి సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌లో ఎవరి పాత్ర ఎంత..?
    హైదరాబాద్‌ : చర్లపల్లి సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ సర్వే నెంబర్‌ 70లో భవన నిర్మాణ అనుమతులను నిబంధనల ప్రకారం జారీ చేశామని, కాప్రా టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ గిరిరాజు తెలిపారు. ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో’’ సర్‌ ప్లస్‌ సీలింగ్‌ భూమిని మింగిన పెద్దలు ఎవరు కథనంపై టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ గిరిరాజు వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెబుతూ.. పూర్తి తప్పంతా అప్పటి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై నేట్టుతూ దాట వేసే సమాధానం చెబుతున్నారు. చర్లపల్లి సర్వే నెంబర్‌ 70లో ఎలాంటి సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ లేదని సమాధానం చెబు తూ ఆ పెద్దలను కాపాడే ప్రయత్నం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2018 లోనే జోనల్‌ అధికారుల ఆదేశాల మేరకు భవన నిర్మాణ అనుమతులను జారీ చేసినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ కు జోనల్‌ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొజెటింగ్‌ కాపీలు అనుమతులు జారీ చేశారని.. వాటి ఆధారంగానే అనుమతులు ఇచ్చామని ఒకరిపైన ఒకరు చెబుతూ దాట వేసే ప్రయత్నం చేస్తు న్నారు. కాప్రా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కిందిస్థాయి సిబ్బందితో కొంత మంది ఆర్కిటెక్చర్లు భూ అక్రమాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనయం. భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని ప్రభుత్వ భూములలో ఫ్లాట్లకు నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ కోట్ల రూపాయలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. గ్రేటర్‌ లోని ఉన్నతాధికారులు స్పందించి చర్లపల్లి సర్‌ ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ ను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు