- జూనియర్ కళాశాల అధ్యాపకుల నిర్వాకం
- కళాశాలలో ఫ్యాన్, లైట్ల కోసం అంట!
- ప్రిన్సిపల్, అద్యాపకులపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్‌ఎస్వీ నాయకుల డిమాండ్..
- కళాశాలలో మౌలిక వసతులు లేవు
- వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
- కళాశాల ప్రిన్సిపాల్ రాజా మోహన్ రావు
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్యాన్లు లైట్లు ఫర్నిచర్ కోసం విద్యార్థుల దగ్గర పైసల్ వసూలు చేసిన అధ్యాపకులపై చర్యలు తీసుకొని, ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘాల నాయ కులు డిమాండ్ చేశారు.
శుక్రవారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల దగ్గర ఫ్యాన్ల ఫర్నిచర్ కోసం ఇద్దరు అధ్యాపకులు సుమారు 30 వేల రూపాయల వరకు చందాలు వసూలు చేశారని ఇట్టి వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘ నాయకుడు దీపక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘం నాయకుడు దీపక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని వసతులు కల్పిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు దగ్గర చందాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 200 మంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఫ్యాన్లు లైటింగ్ కోసం ఈ డబ్బులు వసూలు చేశారని ఆరోపిం చారు. సుమారు రూ.30 వేలు వరకు వసూలు చేసారు అని,వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధించిన ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అలాగే వసూలు చేసిన అధ్యాపకులతో పాటు విషయం తెలిసిన ప్రిన్సిపల్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రిన్సిపాల్ గతంలో ఇలాంటి వాటికి సహకరించినట్లుగా తెలిసిందని అలాంటి ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ప్రిన్సిపల్ రాజా మోహన్ రావు మాట్లాడుతూ కొందరు అధ్యాపకులు విద్యార్థుల దగ్గర చందాలు వసూలు చేశారని వచ్చిన ఫిర్యాదు వాస్తవమే అని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని గతంలో ఫర్నిచర్ కోసం ప్రభుత్వంకు నివేదిక ఇవ్వడం జరిగిందని అన్నారు. సుమారు 2000 గా విద్యార్థులు చదువుతున్న రని విద్యార్థులకు మౌలిక వసతులు సరిగా లేవని అన్నారు. దాతల సహకారంతోనే మౌలిక వసతులను సమకూర్చు కోవడం జరిగిందని ప్రభుత్వం కూడా సహకరించాలని అన్నారు. టిఆర్‌ఎస్వి నాయకుడు దీపక్ అరోపణలు చేయడం తాండూరు పట్టణంలో చర్చని అంశంగా మారింది..