Monday, May 6, 2024

ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలని మాజీ ఎంపీ (ఇలీ హరిరామ జోగయ్య పిటిషన్‌ వేయడం మంచి పరిణామమని, ఈ మేరకు తెలంగాణ హైకోర్టు జగన్‌కు నోటీసులు ఇవ్వడం శుభపరిణామమన్నారు. అన్ని ఒక్కసారిగా ముంచుకు వస్తున్నాయి.. ఎం జరుగుతుందో చూడాలన్నారు. సీఐడీ సంజయ్‌, పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అంతట తిరిగి ప్రెస్‌ విూట్‌లు పెట్టవచ్చా? చంద్రబాబు మాత్రం కేసుపై మాట్లాడొద్దని అంటారా? అంటూ మండిపడ్డారు. ఢల్లీిలో ఒక హోటల్లో సీఐడీ అధికారి సంజయ్‌, సుధాకర్‌ రెడ్డి పెట్టిన ప్రెస్‌ విూట్‌కు ఎవరు డబ్బులు కట్టారు?.. బిల్లులు ఎలా చెల్లించారని రఘురామ ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి సీఎం అవ్వగానే ప్రజావేదిక కూల్చారని, ప్రజావేదిక నిర్మాణానికి కాబినెట్‌ ఆమోదం కూడా ఉందని, అధికారులకు బుద్ధి ఉండాలి కదా అని అన్నారు. ప్రజావేదికను కూల్చడానికి ఎవరు హక్కు ఇచ్చారని సీఆర్డీఏ అధికారులను ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానన్నారు. రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడుపై పెట్టిన 17ఏ కేసు కొట్టేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పని తీరు అద్భుతమని, ప్రజల కొరకు నిరంతరం పని చేస్తారని రఘురామ కొనియాడారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లులు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి.. దానిపై ప్రభుత్వం లోన్‌ తీసుకుందని విమర్శించారు. ప్రభుత్వం ఇళ్లపై తీసుకున్న లోన్‌ బయట పెట్టారని.. ఇదొక పెద్ద స్కాం అని అన్నారు. రేపు జగన్మోహన్‌ రెడ్డి ఏపీలో ఉన్న అందరి ఆస్తులను బ్యాంకుల్లో పెట్టె అవకాశం ఉందన్నారు. టీటీడ నియమాలు ధర్మారెడ్డికి తెలియవని, తెలియకుండా సీఎం జగన్‌ ఆయనను నియామకం చేశారని రఘురామ విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు