Tuesday, May 14, 2024

ఒక్క గంట కరెంట్‌ పోయినా నిలదీస్తాం

తప్పక చదవండి
  • మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి హెచ్చరిక

వనపర్తి ; ఓడినా తాఆము ప్రజల కోసం పనిచేస్తామని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎత్తి చూపుతామని… ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని మాజీ మంత్రి నిరంజర్‌ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుబంధు ఇవ్వాలన్నారు. వ్యవసాయం గెలిచినప్పుడు ఎగరలేదు.. ఓడినప్పుడు బాధపడను. నా ఓటమి నన్ను బాధపెట్టలేదు. కానీ, కేసీఆర్‌ కామారెడ్డిలో ఓడిపోవడం బాగా కలచివేసిందన్నారు. ప్రధానమంత్రిగా పోటీ చేసిన ఇందిరా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఎందరో సీఎం అభ్యర్థులు కూడా ఓడిపోయారని గుర్తు చేశారు. ఓడిపోయానని ఎక్కడికి వెళ్లను.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కానీ హావిూలను కాంగ్రెస్‌ వాళ్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు మోస పోయాము అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారుతున్న కాల్వలు.. పండుతున్న పంట పొలాలు, కనిపిస్తున్న విద్యాసంస్థలు, ఏదుల రిజర్వాయర్‌, మార్కెట్‌ యార్డు మమ్మల్ని గుర్తు చేస్తాయి. నన్ను మరిపించడం ఎవరి తరం కాదన్నారు. ఫలితాలను సవిూక్షించుకొని ముందుకెళ్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు