Sunday, April 21, 2024

డ్రగ్స్‌ నిర్మూలన తనిఖీలతో సరిపెట్టకండి

తప్పక చదవండి
  • ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి
  • డ్రగ్స్‌ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి
  • కేసీఆర్‌ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ
  • గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి
  • పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్‌ మాఫియా
  • డ్రగ్స్‌ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్‌ హైదరాబాద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అధికారులు డ్రగ్స్‌ ముఠాలపై ఆదివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలలో సుమారు 17 పబ్బులు క్లబ్బుల్లో దాడులు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో కాకుండా డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కు పాదం మోపే విధంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలానే దాడులు చేసి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ తీసుకుంటారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పెద్దలే ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారని అందుకే నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే అపవాదు కూడా ఉంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను నిర్మూలించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుందని అంటున్నారు. డ్రగ్స్‌ నిర్మూలన చేసేందుకు పోలీసు అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

కేసీఆర్‌ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ

- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగాయి. యువత మత్తులో జోగుతూ తమ కర్తవ్యాలను మర్చిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓకానొక సందర్భంలో ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు పైన కూడా డ్రగ్స్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో కొంతమంది సినీ తారల పైన డ్రగ్స్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా అప్పట్లో కొంతమందిని పోలీసులు విచారించి కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఏమయ్యాయో ఇప్పటివరకు తెలవదు. ఇప్పుడు అలా కాకుండా డ్రగ్స్‌ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ధారణ అయితే కఠినంగా శిక్షలు వేయాలని అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అధికారులు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా నిజాయితీగా వ్యవహరించాలని అంటున్నారు.

పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్‌ మాఫియా
రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాలయాల్లో యువకులు డ్రగ్స్‌ కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత మత్తుకు బానిస లు కావడం వెనకాల కొంతమంది బడాపడా నేతలు ఉన్నారు. వారెవరిని వదిలిపెట్టకూడదని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న వారు ముఖ్యంగా రాజకీయ నాయకులు బడబడ వ్యాపారవేత్తలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బే దేయంగా ఇలాంటి నీచ పనులు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నర ఏళ్ళుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్‌ మాఫియా, డ్రగ్స్‌ మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మాఫియా వెనుక ఒక రాజకీయ నాయకుడే ఉంటున్నాడు. ప్రజలు వారికి ఓట్లు వేసి గెలిపించేది ప్రజలకు మేలు చేస్తారని కానీ వారు ఏం చేస్తున్నారు. పసి మొగ్గ లాంటి యువతను చిదివమేస్తున్నారు. ప్రజలారా మేల్కొనండి పూర్తిగా ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకోకండి ఈ మాఫియాలను అరికట్టేందుకు మీరు కూడా సిద్ధం కండి.. ఇప్పటికే డ్రగ్స్‌ మాఫియాల పై ఎన్నో సంచలనాత్మక కథనాలను రాసిన ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రిక ప్రజల కోసం ఇలాంటి మాఫియాలను అంతమొందించేందుకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు