Sunday, April 28, 2024

కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ కేసు..

తప్పక చదవండి
  • ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఖత్రీపై సీబీఐ కేసు..
  • అమన్ సింగ్ ధల్ నుంచి రూ. 5 కోట్లు
    లంచం తీసుకున్నట్లు ఆరోపణలు..
  • లిక్కర్ కేసులో ఇది కొత్త కొనమంటున్న విశ్లేషకులు..
  • మున్ముందు ఇంకెన్ని నిజాలు బయటపడనున్నాయో.. ?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. లిక్కర్ కేసు విచారణలో నిందితుడు అమన్‌సింగ్ ధల్ నుంచి రూ. 5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు మోపింది. మనీలాండరింగ్ వ్యాపారి అమన్‌దీప్ నుంచి ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్‌తో పాటు.. క్లారిడ్జెస్ హోటల్ సీఈవో విక్రమాదిత్యపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరంతా నేరుపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. పవన్‌కు లంచం, ఇతరత్రా ఇచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ అధికారులు వెల్లడించారు. లిక్కర్ కేసులో ఇది కొత్తకోణమే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి.. చాలారోజులు లిక్కర్ కేసు స్థబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య కొందరి పేర్లు ఈడీ దర్యాప్తు, సీబీఐ దర్యాప్తు తీసేశారన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతేకాదు.. ఇక ఈ కేసు మూలన పడిందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్లు సీబీఐ తేల్చడం అనూహ్య పరిణామమే. దీంతో కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఇప్పటి వరకూ ఐదు కోట్లు మాత్రమే ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు రాగా.. మున్ముందు పవన్‌ను సీబీఐ విచారిస్తే ఇంకెన్ని బయటపడతాయో అనే ఆరోపణలు లేకపోలేదు. త్వరలోనే కేసు నమోదు చేసిన వారందర్నీ సీబీఐ అధికారులు విచారణకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు