Sunday, May 5, 2024

కేసీఆర్ మళ్ళీ గెలిస్తే వ్యవసాయం బంద్ అవుతుంది..

తప్పక చదవండి
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్..
  • బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు నష్టపోతారు..
  • లిక్కర్ స్కాం లు, డబ్బులు దండుకోవడమే కేసీఆర్ పని..

మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని కేంద్రానికి లేఖ రా‌శారన్నారు. కిలో 5 నుంచి 6 రూపాయలు తక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్మేందుకు కల్వకుంట్ల కుటుంబం‌ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. మిల్లులను అప్ గ్రేడ్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని తెలిపారు. లిక్కర్ స్కాంలు, డబ్బులు దండుకోవడం తప్ప ఏమీ చేయలేదు బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. మక్కపంట వేయొద్దని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతుందని… మరోవైపు అవే మక్కలను ఇంపోర్ట్ చేసుకోవాలని కేంద్రంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఎంపీ తెలిపారు.

బియ్యం అమ్మకాలతో నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశారన్నారు. బియ్యం అమ్మకాలతో భారీ స్కాం చేయాలని కల్వకుంట్ల కుటుంబం ప్లాన్ చేస్తుందని విమర్శించారు. గద్దెపై రాబందులు బియ్యం అమ్ముకుంటున్నారని.. గద్దె కింద పందికొక్కులు బియ్యం తింటున్నాయంటూ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ దద్దమ్మ.. సోమరిపోతు అంటూ వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల వాళ్ళకంటే పందికొక్కులు నయమన్నారు. బియ్యం బ్లాక్ మార్కెట్ దందాలో కేటీఆర్ మునిగిపోయారన్నారు. నిజామాబాద్‌లో కవిత ఎక్కడ పోటీ చేసినా మూడో స్థానానికి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రికి ధాన్యం అమ్మకాలపై అవగాహన లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు