Friday, May 3, 2024

దళిత బంధు ఓ దరిద్ర బంధట..

తప్పక చదవండి
  • మంత్రి పంపిణీ చేసిన గోడ గడియారాలను రోడ్డుపై వేసి తొక్కిర్రు
  • అర్హులకు దళిత బంధు అందలేదని సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన
  • నెమ్మికల్ గ్రామ దళితులు…రోడ్డుపై బైఠాయించిన మహిళలు
  • అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.నిరసన ప్రదర్శన

హైదరాబాద్ : దలిత బంధు అనర్హులకు ఇచ్చారని ఆరోపిస్తూ బుధవారం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలం నిమ్మికల్లు గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామ సర్పంచ్ ని అడగడానికి వెళ్లిన దళితులపై సర్పంచ్ కుమారుడు దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడంతో రగిలిపోయిన దళితులు, సర్పంచ్ ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోతో ఉన్న గోడ గడియారాన్ని నెలకేసి కొట్టి, కాళ్లతో తొక్కారు. అక్కడి నుండి నేరుగా సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై దళితులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నెమ్మికల్ గ్రామ సర్పంచ్ గంపల సతీష్, ఉప సర్పంచ్ రేణికుంట్ల ఉపేందర్, వార్డు సభ్యులు తన అనుచరులు,బంధువులకే దళిత బంధు ఇచ్చారని ఆరోపణలు చేశారు. గ్రామానికి వచ్చిన దళిత బంధు 24 యూనిట్లుగా కేటాయించారు. ఇందులో మాదిగలకు 12, మాలలకు 12 యూనిట్లుగా పంచుకున్నారని తెలిపారు. దళిత బందు యూనిట్ లని అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, భూములు కలిగి ఉండి, ఆర్థికంగా బలపడిన వారికే స్థానిక నాయకులు అందించారని మండిపడ్డారు.

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.. నిరసన ప్రదర్శన :
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని శాంతింప చేసే ప్రయత్నం చేయగా, తాము దళిత బందుకు పూర్తిగా అర్హులమని, తమకు న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన ఆత్మకూర్ (ఎస్) ఎస్సై వెంకట్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు. గృహలక్ష్మి పథకంలో అక్రమాలు జరిగాయని, భూములు, భవనాలు ఉన్న వాళ్లకే లబ్ధి చేకూర్చాలని నిరుపేదలకు పథకంలో అవకాశం కల్పించకుండా చేశారన్నారు. గతంలో నిమ్మికల్ కు వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా పలితం లేకపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగాము అని, ఇక్కడ కూడా పోలీస్ లు అడ్డుకోవడంతో, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగామని చెప్పారు.. ఈ ధర్నాలో జానికి రాములు, ధార సైదమ్మ, గంపల లెనిన్, గంపల కర్నాకర్, పరిక చంద్రు, నాగవల్లి, ఎల్లేష్, నాసరి బిక్షం, గంపల రత్నమ్మ, బోప్పని రేణుక, భద్రి, మేకల మెరమ్మ, చింతపల్లి సాయి, కలమ్మ మరికొంత మంది దళితులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు