Tuesday, April 30, 2024

పోటెత్తిన జన ప్రభంజనం..

తప్పక చదవండి
  • జన సంద్రంగా మారిన పఠాన్ చెరు పట్టణం..
  • పఠాన్ చెరు అంబేద్కర్ చౌక్ నుండి బీరంగూడ
    శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వరకు మహా పాదయాత్ర..
  • వేలాదిగా హాజరైన సబ్బండ వర్గాలు..
  • బరిలో నిలబడుతున్నాం.. కలిసి పోరాడధాం.. గెలిచి చూపిద్దాం…
  • అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్న
    సబండవర్గాల అభివృద్ధి నా లక్ష్యం..
  • చలి చీమల ఐక్యమత్యంతో కొండ చిలువ పని పడదాం…
  • త్వరలో నియోజకవర్గమంతా పాదయాత్ర…
  • మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా : నీలం మధు..

ఈ పాదయాత్ర మార్గమధ్యలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, వడ్డే సోదరుల ఆహ్వానం మేరకు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మైనారిటీ సోదరుల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలో పాల్గొని ఆశీర్వాదం స్వీకరించారు నీలం మధు ముదిరాజ్… మహా పాదయాత్ర ఆరంభం మాత్రమే ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు నీలం మధు ముదిరాజ్…

హైదరాబాద్ : ఒక మహా ప్రభంజనం పెల్లుబికింది.. పోటెత్తిన సంద్రంలా అభిమాన గణం తరలింది.. తమ నేతపై ఉన్న అభిమానాన్ని ఆకాశమంతగా చాటింది.. సబ్బండ వర్గాల శక్తి ఏమిటో ఈ ప్రపంచానికి చాటింది.. జననేత కోసం పోలీసు పహారాను సైతం నెట్టేసి సునామీలా దూసుకు వచ్చింది.. తమ అభిమాన నేతను గెలిపించుకుంటామంటూ ముక్తకంఠంతో నినదించింది.. ఆకాశానికి చిల్లుపడిందా..? నెల ఈనిందా..? అన్నట్టుగా పఠాన్ చేరు జనసంద్రంతో మారుమ్రోగిపోయింది.. నీలం మధు ముదిరాజ్ కు మద్దత్తుగా జరిగిన యాత్ర ఎవరూ ఊహించని విధంగా విజయవంతమైంది..

- Advertisement -

ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రకు బహుజన సబండవర్గాల ప్రజలు పోటెత్తారు.. ఈ మహా పాదయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముందుగా మైత్రి గ్రౌండ్ వద్దకు చేరుకున్న తన అభిమానులు, పాదయాత్రకు హాజరైన ప్రజలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు. పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. మహా పాదయాత్రకు హాజరైన జనసందోహం కోరిక మేరకు నీలం మధు ముదిరాజ్ ముందుండి పాదయాత్రలో పాల్గొన్నారు. మహా పాదయాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి నీలం మధు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు పాటుపడుతూ, బీసీ ఉద్యమన్ని ముందుకు నడిపిస్తామన్నారు.. బీసీ బిడ్డ చట్టసభల్లో గొంతు ఎత్తుతేనే సబ్బండ వర్గాల ప్రజలందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు.

తనను ఎమ్మెల్యే గా చూడాలనే సంకల్పంతో వేలాది సబ్బండ వర్గాల ప్రజలు తనకు మద్ధతుగా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. మహా పాదయాత్రను అడ్డుకోవాలని కొంతమంది నేతలు ఎన్ని కుట్రలు చేసినా, పోలీస్ బలంతో పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా ఆ కుట్రలను ఛేదించుకొని తరలివచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం ఋణపడి ఉంటాను అన్నారు. బహుజన నాయకుని ఎదుగుదల జీర్ణించుకోలేక కొందరు నేతలు మనల్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఐక్యమత్యంతో చలి చీమల్లా ముందుకు కదలి ఆ కొండచిలువల పని పడదామని పిలుపు నిచ్చారు. తన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న నాయకులకు పది మంది కుటుంబ సభ్యులు ఉంటే, తనకు నియోజకవర్గ ప్రజలే కుటుంబసభ్యులని పేర్కొన్నారు. తన వెంట ఉన్న వేలాది మంది ఒక్కొక్కరు 100 ఓట్ల చొప్పున వేయిస్తే.. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని నినదించారు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రైస్తవ, సబ్బండ వర్గాల సత్తా నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని, మన బలహీన వర్గాల బిడ్డలు చట్ట సభల్లో అడుగు పెడితేనే మన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అన్నారు.

సామాజిక న్యాయమే లక్ష్యంగా త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చూడుతున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలో ప్రతి గడప తొక్కుతానని, ప్రతి ఒక్కరిని కలిసి మద్దతు కూడగట్టడంతో పాటు ప్రతి సమస్యను తెలుసుకుంటానని స్పష్టం చేశారు. కుల, మతాల కతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలు ఏకమై మన హక్కులను సాధించుకుందమని స్పష్టం చేశారు. జనమే తన బలంగా, బహుజనుల హక్కులే ఎజెండాగా, సబండవర్గాల సమస్యల పరిష్కారమే మేనిఫెస్టో గా ముందుకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. మీ అందరూ వెంట ఉంటే, మీ ఆదరాభిమానాలు ఉంటే, పార్టీ గుర్తులతో పనిలేదని సబండవర్గాల ప్రతినిధిగా మీ ఇంట్లో ఒక్కడు, మీ కుటుంబ సభ్యుడైన నీలం మధు ముదిరాజ్ ఒక గుర్తుగా ముందుకు వెళదామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తనకు దేవుళ్ళతో సమానమని, తనను మీ ఇంటి బిడ్డగా భావిస్తూ పెద్ద మనసుతో తనను ఆశీర్వదించాలని కోరారు. తన మీద నమ్మకంతో వేలాదిగా తరలి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కుల సంఘల నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు