Saturday, May 18, 2024

ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు పెంచాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున..

హైదరాబాద్ : ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఇచ్చే ఉచిత విద్యుత్తు ను 101 యూనిట్ల నుండి 300 యూనిట్ల వరకు పెంచాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శనివారం జిల్లా విద్యుత్ ఎస్.ఈ. తరుపున ఆఫీస్ ఏఈ చిట్యాల రాజుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018 లో 342 జీవోను జారీ చేసిందని తెలిపారు. ఆ జీవో ప్రకారం 101 యూనిట్లు విద్యుత్ వాడిన దళిత, గిరిజనుల దగ్గర బిల్లులు వసూలు చేయరాదు, కానీ కిందిస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది బిల్లులు వసూలు చేస్తూ.. ఆయా వర్గాల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని విమర్శించారు. బిల్లు చెల్లించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, విద్యుత్తు లైను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు కోసం విద్యుత్ శాఖ సిబ్బంది కెవిపిఎస్ నాయకత్వంతో కలిసి సంయుక్త మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులను తీసుకొని మళ్లీ దళితుల నుండి కూడా బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జీవోను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనిని తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది బిల్లుల కోసం వస్తే దళితులెవ్వరు బిల్లులు చెల్లించవద్దని సూచించారు. ధనికులకు భూస్వాములకు గజటెడు ఉద్యోగస్తులకు వ్యవసాయానికి ఉచితకరంటూ లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నారని నిలువ నీడలేని దళితులు గిరిజనులను ముక్కుబిండి వసూలు చేస్తూ జైలు పాలు చేస్తున్నారని అన్నారు.. ప్రభుత్వం ఇప్పటికైనా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పెంచి ఇవ్వాలన్నారు.. రాబోయే ఎన్నికలలో ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో 300 ఉచిత విద్యుత్తు ఉండాలని కోరారు.. లేని పక్షంలో దళితులు సరియైన గుణపాఠం నేర్పుతారని అన్నారు. కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్షులు రెమిడాల పరిషరాములు, గాదె నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నగేష్, ,కోడి రెక్క మల్లన్న, ఉంటే పాక కృష్ణ, సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ తక్కిళ్ళపల్లి శ్యామ్ లు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ అమలు చేయాలని అనేకసార్లు విద్యుత్ శాఖ ఎస్ ఈకి విన్నవించినప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు. తాము ఆందోళన చేసినప్పుడు దళితుల దగ్గర బిల్లులు వసూలు చేయరాదని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశిస్తామని జిల్లా స్థాయి అధికారులు చెబుతారు, కానీ కింది స్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి మీటర్లు లేని నిరుపేదలకు తక్షణమే మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల విద్యుత్ పెండింగ్ బకాయిలను వసూలు చేయరాదని కోరారు. బిల్లులు చెల్లించని దళితుల ఇళ్ల విద్యుత్తు లైను తొలగించ రాదని , కేసులు నమోదు చేయరాదని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు