- వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం..
- ఇప్పటికే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్న రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవ తారం ఎత్తారు. ఎర్రచొక్కా ధరించి కొద్ది సేపు వారితో కలిస మూటలు మోసారు. ఈ ఘటన ఢిల్లీ లో జరిగింది. సమాజంలో విభిన్న వర్గాలు, వృత్తులవారి సాధకబాధకాలను ప్రత్యక్షంగా తెలుసుకో వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు.. వరి నాట్లు వేసి రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్న రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి ఈసారి రైల్వే కూలీల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రైల్వే కూలీగా మారిపోయారు. ఢిల్లీ లోని ఆనంద్ విహారి రైల్వే స్టేషన్‌లో కూలీలతో రాహుల్ గాంధీ గురువారం ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా పరిశీలించారు.అనంతరం రైల్వేకూలీల ట్రేడ్‌మార్క్ రెడ్ టీషర్ట్ ధరించారు. తలపై లగేజీ పెట్టుకుని కొంత దూరం మోశారు. రైల్వే కూలీల సమస్యలు కూడా వినా లని కొన్ని నెలలక్రితం అభ్యర్థించడంతో రాహుల్ గురువారం వారి దగ్గరకు వెళ్లారు. ఇదిలా వుండగా భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ విభిన్న వర్గాల సమస్యలను తెలుసు కున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విభిన్న వర్గాలను కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే.