Wednesday, May 8, 2024

సీఎం భద్రతా సిబ్బందిలో బ్లాక్‌ షీప్స్‌

తప్పక చదవండి
  • రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్‌..?
  • సమాచారం లీకయ్యిందా.. లేక లీక్‌ చేశారా ?
  • అధికారులపై సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌
  • సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్‌ కీలక నిర్ణయం!
  • భద్రత విషయంలో ఇంటెలిజెన్స్‌ కీలక మార్పులు
  • చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మినహా పాతవారి తొలగింపు
  • కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్‌ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సెక్యూరిటీ సిబ్బందిని మ్నెత్తం మార్చేయాలని సూచించింది. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ వద్ద పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని రేవంత్‌ వద్ద ఉంచడానికి వీళ్లేదని స్పష్టం చేసింది . ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం లీక్‌ అవ్వడంతో ఐబీ ఈ నిర్ణయం తెలుస్తోంది..

సమాచారం లీకయ్యిందా ..లేక లీక్‌ చేశారా ?
సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగిసిన తర్వాత ఐబీ సీఎం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ మొదలుపెట్టింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్‌ అధికారులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఏం జరిగిందని అధికారులు ఆరా తీయగా.. సీఎం సమాచారం లీక్‌ అవుతందని.. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ సమాచారం చేరుతుందని నిఘా వర్గాలు గుర్తించాయి . ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద భద్రతా అధికారులను మార్చాలని సీఎంఓ నిర్ణయించింది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని.. సిబ్బందిని కూడా సీఎం రేవంత్‌ వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది.

- Advertisement -

భద్రత విషయంలో ఇంటెలిజెన్స్‌ కీలక మార్పులు
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలు విభాగాల అధిపతుల్ని మార్చిన సంగతి తెలిసిందే. కీలక పోస్టుల్లో ఉన్న పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ప్రభుత్వం మార్చేసి ప్రక్షాళన మొదలుపెట్టింది. గత సీఎం కేసీఆర్‌ వద్ద ఉన్న సిబ్బందిలో కూడా చాలా మందిని మార్చారు. అయితే కొంత మంది భద్రతా సిబ్బంది మాత్రం పాతవారే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సీఎం సమాచారం లీక్‌ అవుతుండటంతో వారిని కూడా మార్చాలని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు