Saturday, May 11, 2024

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించిన చింతపట్ల విద్యార్థులు

తప్పక చదవండి
  • వర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని చింతపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు (అమ్మాయిలు) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించారని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మహమ్మద్ సాబేర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేట్ లో జరిగిన 67 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ లో రాణించి ఈ నెల 19 నుండి మహబూబ్ నగర్ జిల్లా లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చింతపట్ల ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదివే ఉమామహేశ్వరి , వి. స్పందన రాష్ట్ర స్థాయి క్రీడాపోటిలకు ఎంపికయ్యారని తెలిపారు.

గతంలో కూడ చింతపట్ల పాఠశాల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడ పాల్గోని పతకాలు సాధించారనీ గుర్తు చేశారు. ఈ ఏడాది మే లో జరిగిన సీఎం కప్ క్రీడాల్లో కూడ రాణించి మండల స్థాయిలో 7 పతకాలు సాధించారన్నారు. జిల్లా స్థాయిలో రెండు పతకాలు సాధించి యాచారం మండలానికి జిల్లాలోనే గుర్తింపు తెచ్చారనీ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రీడల్లో అద్భుతంగా రాణించేలా నిరంతరం శ్రమించే చింతపట్ల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మహ్మద్ సాబెర్ ని , రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అయిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభదేవి , చైర్మన్ బిక్షపతి , గ్రామ సర్పంచ్ లిక్కి సరిత , ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు….

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు