Monday, April 29, 2024

సీబీఎన్ ఈస్ మై హీరో..

తప్పక చదవండి
  • జగన్ అనుకున్నదొక్కటి జరుగుతుంది మరొక్కటి
  • ప్రపంచ వ్యాప్తంగా బాబు అరెస్టును ఖండిస్తున్నారు
  • చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతును చూసి అధికారపార్టీలకు
    కంటి మీద కునుకు లేకుండా పోయింది..
  • కక్షసాధింపులో భాగంగా బాబుఫై అక్రమ కేసులు పెట్టారు
  • కడిగిన ముత్యంలా సీబీఎన్ బయటికి రావడం ఖాయం
  • టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బేషరతుగా వెంటనే విడుదల చేయాలనీ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఉద్యోగులు, టీడీపీ అభిమానులు స్వచ్ఛందంగా పగలు, రాత్రుళ్ళు అని తేడాలేకుండా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మై హీరో సీబీఎన్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. జగన్ తన అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి.. ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిఫై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ పతనమయిపోతుందన్న భ్రమతో జగన్ కొత్తనాటకానికి తెర తీశారని పేర్కొన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలలోని ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉద్యోగులు కూడా నిరసనలు చేపడుతూ .. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. జగన్ అనుకున్నదొక్కటని కాని జరిగింది.. జరుగుతుంది మరొక్కటి కావడంతో ఏంచేయాలో జగన్ తేల్చుకోలేక పోతున్నారని అన్నారు. 74 ఏండ్లు పూర్తయిన ఓ గొప్ప నాయకుడిపై జగన్ చేస్తున్న పైశాచికత్వానికి మూల్యం చెల్లించుకోకతప్పదని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాక
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని ఆయన ఆలోచనలు, ఇప్పటి తరానికి.. రాబోయే తరానికి దిక్సూచి అని జ్ఞానేశ్వర్ కొనియాడారు. కక్షసాధింపులో భాగంగా బాబుఫై పెట్టిన అక్రమ కేసులు త్వరలో వీగిపోవడం ఖాయమని జ్ఞానేశ్వర్ తెలిపారు. కడిగిన ముత్యంలా సీబీఎన్ బయటికి రావడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కూడా ఖాయమని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.

పార్లమెంట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాం :
ఇందులోనూ జనాభా ప్రాతిపదికన బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళకు వాటా ఇవ్వాలి. దేశంలో మొదటిసారి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు..వచ్చే ఎన్నికల నుండే దేశంలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి .. అంటూ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు..

- Advertisement -

పార్లమెంట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం మహిళా బిల్లుపై స్పందించిన ఆయన.. అసెంబ్లీ, పార్లమెంట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ రిజర్వేషన్లను వాయిదా వేయకుండా వచ్చే ఎన్నికల నుంచే అమలు చేయాలని ఆయన కోరారు. దేశంలోనే మొదటిసారిగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న రిజర్వేషన్లలో ఆయా వర్గాల మహిళలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.

కడిగిన ముత్యంలా సీబీఎన్ బయటికి రావడం ఖాయం :
టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ చాలా దురదృష్టకరమైన సంఘటన అని అయన అభివర్ణించారు. టీడీపీ శ్రేణులకు, టీడీపీ అభిమానులకు, తెలుగు ప్రజలకు న్యాయ వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉందని
కడిగిన ముత్యంలా సీబీఎన్ బయటికి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతును చూసి తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని వీరేష్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం ఖాయమని వీరేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం పార్లమెంట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ స్వాగతించారు. ఇందులో జనాభా ప్రాతిపదికన బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు