Friday, May 17, 2024

అభివృద్ధికే పట్టం కట్టండి : తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వెల్లడిరచారు. హైదరాబాద్‌ అభివృద్ది కళ్ల ముందే కనిపిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాత్ర ఎంతో ఉన్నదని మంత్రి తలసాని తెలిపారు. జనం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో హాయిగా బతుకుతున్నరని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు. అయినా తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని చెప్పారు. మరే రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతు పండిరచిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటున్నదని మంత్రి చెప్పారు. ఆడపిల్ల పెళ్లికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని మంత్ర పేర్కొన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బీఆర్‌ఎస్‌ సర్కారు అనేక పథకాలను తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. కరోనా కాలంలో వలస కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకున్నదని మంత్రి తలసాని గుర్తు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు