Monday, May 6, 2024

సిరియా విమానాశ్రయాలపై బాంబుల వర్షం

తప్పక చదవండి

జెరూసలేం : హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించటమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుంది. సిరియా రాజధాని డమాస్కస్‌, మరో ప్రధాన నగరం అలెప్పోపై దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిరది. సిరియాకు చెందిన న్యూస్‌ ఏజెన్సీ సనా ఈ విషయాన్ని వెల్లడిరచింది. దాడుల విషయాన్ని జెరూసలేం పోస్ట్‌ ధ్రువీకరించింది. మరోంఐపు, ఇరాన్‌ లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్టు బావిస్తున్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడిన సమయంలో ఇరాన్‌ దౌత్యవేత్తల విమానం సిరియాలోని విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ఆ సమయంలోనే బాంబుల వర్షం కురిసింది. దీంతో విమానం అక్కడ ల్యాండ్‌ అవకుండానే వెనుదిరిగింది. హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ ఉందని ఇజ్రాయెల్‌ మొదట్నుంచి భావిస్తోంది. దీంతో గురువారం సిరియా పర్యటనకు వచ్చిన ఇరాన్‌ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు పలువురు భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు