Friday, May 10, 2024

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి శుభాకాంక్షలు

తప్పక చదవండి
  • పూర్తి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో నూతన ప్రభుత్వం
  • హర్షం వ్యక్తం చేసిన టి.ఎన్.ఎస్.టి.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాణి సక్కుబాయి

“నీళ్లు, నిధులు, నియామకాలే” ఊపిరిగా… ఏర్పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో.. గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ, ఉద్యోగ ,ఉపాధ్యాయ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా.. తద్వారా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తూ.. విద్యాభివృద్ధిని కాంక్షించే విధంగా. నేటి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోతుందని టి.ఎన్.ఎస్.టి.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాణి సక్కుబాయి హర్షం వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన ప్రభుత్వం విద్యార్థి విద్యారంగ సమస్యలను, నిరుద్యోగులకు ఊరటనిచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని.. తద్వారా ప్రతి సంవత్సరము కూడా ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీ అయిన అన్ని పోస్టులను గుర్తించి, భర్తీ చేస్తూ.. నిరుద్యోగుల జీవితాలలో సంతోషాన్ని నింపాలని కోరారు… ఆడపిల్లలపై రోజు రోజుకి పెరిగిపోతున్న అఘాయిత్యాలను సైతం అరికట్టేలా నూతన ప్రభుత్వ విధానాలు ఉండాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉనికిని, గౌరవాన్ని గుర్తిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా.. స్నేహపూర్వక ప్రభుత్వ విధానాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకోవాలని ఆకాంక్షించారు.. గత సంవత్సర కాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రాబోయే వేసవికాల సెలవుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 317 జీవో ప్రకారం నష్టపోయిన ఉద్యోగులందరికీ సొంత జిల్లాలకు తీసుకొచ్చే విధంగా కార్యచరణ రూపొందించాలని మరియు ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయినటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నూతనంగా కొలువుదీరనున్న ప్రభుత్వం యావత్ తెలంగాణ సమాజం హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు