Tuesday, October 3, 2023

ప‌వ‌ర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్..

తప్పక చదవండి

ఆసియా క‌ప్ చివ‌రి సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో బంగ్లాదేశ్ ప‌వ‌ర్ ప్లేలోనే కీల‌క వికెట్లు కోల్పోయింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ లిట్ట‌న్ దాస్‌(0) డకౌట‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ తంజిద్ హ‌స‌న్‌(13)ను శార్థూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అనాముల్ హ‌క్‌(4)ను కూడా శార్దూల్ పెవిలియ‌న్ పంపాడు. దాంతో బంగ్లా 10 ఓవ‌ర్ల‌లో3 వికెట్ల న‌ష్టానికి 44 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ఆల్‌రౌండ‌ర్ మెహిదీ హ‌స‌న్ మిరాజ్‌(13), కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్(19) క్రీజులో ఉన్నారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 24 ర‌న్స్ జోడించారు. 13 ఓవ‌ర్ల‌కు బంగ్లా స్కోర్ 58/3. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్లింగ్ తీసుకున్నాడు. నామ‌మాత్ర‌మైన ఈ మ్యాచ్‌లో ఇండియా ఐదు మార్పులతో ఆడుతోంది. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా, పేస‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, చైనామ‌న్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ల‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు