Thursday, May 2, 2024

ఢిల్లీలో ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 ప్రధానం

తప్పక చదవండి
  • ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ ఐఏఎస్

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని ఓ క్లబ్ పేస్ కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లబ్బులో జరిగిన ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డు 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా యస్.సునీల్ కుమార్ ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 అవార్డు అందుకొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ సుప్రీం కోర్టు న్యాయవాది హవీబ్ సుల్తాన్ మాట్లాడుతూ ఆశ్రా హక్కులపై అవగాహన కల్పిస్తూ.. వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తూ, ఆశ్రా సంస్థ సేవలు సమాజానికి అందిస్తున్న వారికి ఢిల్లీలో జరిగే 5వ జాతీయ సదస్సులో విశిష్ట సేవా పురస్కారాలు ప్రముఖులచే అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మున్ముందు అనేక సమస్యలపై అవేర్నెస్ కార్యక్రమాలతో పాటు వినియోగదారుల హక్కులపై, సమస్యలపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నిత్యం అందరికి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. అవార్డు గ్రహిత యస్.సునీల్ కుమార్ మాట్లాడుతూ నా సేవలను గుర్తించి నాకు ప్రత్యేక పురస్కారాన్ని అందించినందుకు మరింత బాధ్యతతో ప్రజలకు సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, చేతనైన సహాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, శివారెడ్డి, సెక్రటరీ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు