Sunday, May 12, 2024

కేసీఆర్ ఆటలో రేవంత్, హరీష్ రావులు (బలికా బక్రా) బలి పశువులు కాబోతున్నరు

తప్పక చదవండి
  • సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీష్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా
  • సీఎం పదవి కోసమే ఇద్దరూ కొట్టుకుంటున్నారట
  • కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదు
  • అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉంది
  • అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే దుస్థితి బీఆర్ఎస్ ది
  • ఎంఐఎం, కాంగ్రెస్ తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడ
  • బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు కుట్ర చేస్తున్న ఆ మూడు పార్టీలు
  • బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం…
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన ఆరెపల్లి మోహన్
  • ఆరెపల్లితోపాటు పలువురు నాయకులు బీజేపీలో చేరిక

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న డ్రామాలో చివరకు హరీష్ రావు, రేవంత్ రెడ్డి బలి కా బక్రాలు (బలిపశువులు) కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోపై చర్చించేందుకు కేటీఆర్, హరీష్ లను కేసీఆర్ పిలిపించినట్లు వచ్చిన వార్తలు కూడా కరెక్ట్ కాదన్నారు. సీఎం సీటు కోసం బావ బామ్మర్థులు కేసీఆర్ ఎదుట గొడవ పడుతున్నారని, ఈ గొడవ తాళలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే హరీష్ ను, కేటీఆర్ లను వేర్వేరుగా పిలిచి నీకంటే నీకే సీఎం పదవిస్తానంటూ ఊరిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి సైతం వేరే మార్గాల ద్వారా ఇదే విధమైన రాయబారాలు పంపుతున్నారని అన్నారు.

గురువారం రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ జడ్పీటీసీ జోగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దిలీప్, సతీష్, నవీన్, వికాస్ తోపాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

- Advertisement -

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా. ఆయనతోపాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు చేరడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పరిస్ధితి అధ్వాన్నంగా ఉంది. ప్రధానమంత్రి మోదీ సభకు వచ్చిన ప్రజలను చూసిన తరువాత…. ఆ పార్టీని ఎవరూ దేఖడం లేదు. చివరకు అడ్డా కూలీలను తీసుకొచ్చి పైసలిచ్చి బీఆర్ఎస్ కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకుంటున్న దీనస్థితికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు రెండు కలిసి కుట్ర చేస్తున్నయి. పైకి మాత్రం నువ్వు కొట్టినట్లు చేయ్… నేను ఏడ్చినట్లు చేస్తానని ఒప్పందం చేసుకుని డ్రామాలాడుతున్నయ్.
ప్రజలు వాస్తవాలన్నీ గమనిస్తున్నారు. బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓట్లు చీల్చకుండా వార్ వన్ సైడ్ చేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. బీజేపీకి సీట్ల కేటాయింపు విషయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. మా లిస్ట్ ఇప్పటికే ఢిల్లీకి పోయింది. కానీ కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినంక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్ లో రేవంతన్న బలి కా బ్రకా (బలిపశువు) కాబోతున్నరు. కేసీఆర్ డ్రామాలాడుతున్నరు. హరీష్ ను పిలిచి నువ్వే సీఎం అని దువ్వుతున్నడు.. కేటీఆర్ కు ఫోన్ చేసి నువ్వే సీఎం అని చెబుతున్నడు. రేవంత్ రెడ్డి కి వేరేవాళ్లతో ఫోన్ చేయించి ఇదే మాట చెబుతున్నడు.

ప్రగతి భవన్ లో హరీష్, కేటీఆర్ సీఎంతో భేటీ అయ్యారట. పైకి మాత్రం మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్నట్లు డ్రామా చేస్తున్నడు. అసలు కథ ఏందంటే సీఎం పదవి కోసం కేసీఆర్ వద్ద హరీష్, కేటీఆర్ కొట్టుకుంటున్నరట. తెలంగాణ ఉద్యమకారుడిని నేను… నాకు సీఎం ఇవ్వకుండా అమెరికా నుండి వచ్చిన కేటీఆర్ కు ఎందుకు సీఎం పదవి ఇస్తారని హరీష్ గొడవ చేస్తున్నడట… పైకి మాత్రం బావా బావా అంటూ డ్రామాలాడుతున్నరు. వీళ్లెన్ని డ్రామాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అభివ్రుద్ధి చెందాలన్నా, బతుకులు మారాలన్నా బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నరు.
తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా… గతంలో కాంగ్రెస్ పాలించింది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది. ఇద్దరి పాలనలో తెలంగాణ అథోగతి పాలైంది. కాబట్టి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు