Monday, May 6, 2024

17వరోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

తప్పక చదవండి
  • పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన మహిళలు
  • కోనసీమ జిల్లాలో ముగ్గిరిని సస్పెండ్‌ చేసిన అధికారులు

కోనసీమ : సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్‌ నుంచి టెర్మినేట్‌ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో బుధవారం సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని తప్పించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ అయ్యాయి. మరికొందరిని తప్పించడానికి అధికారుల అడుగులు వేస్తున్నారు. ఎవరు సమ్మె చేసినా ఊరుకోవద్ధని అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఆడియో మెసేజ్‌లో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు పట్ల వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మెడకు ఉరి తాళ్ళు బిగించుకొని నిరసన తెలిపారు. 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు.ప్రభుత్వం ఎంత బెదిరిస్తే ఉద్యమం అంతే స్థాయిలో ఉదతం చేస్తామని హెచ్చరించారు. శిబిరంలో అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని,గ్రాట్యుటీ చెల్లించాలని , మెనూ చార్జీలు పెంచాలని పెద్ద ఎత్తున నినదించారు. రాజంపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గురువారం పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ప్రతి అంగన్వాడీ మహిళ గురువారం ఉత్తరాలు రాసి తపాలా ద్వారా విజయవాడ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పంపించారు. తిరుపతి జిల్లా గూడూరులో పోస్ట్‌ కార్డుల ద్వారా అంగన్వాడి కార్యకర్తలు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కి పోస్ట్‌ ద్వారా పోస్ట్‌ కార్డులను పంపించారు. రాజధాని ప్రాంతం తుళ్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గురువారం చెవిలో పువ్వుతో నిరసన తెలిపాఉ. కడప జిల్లా వేంప్లలెలో అంగన్వాడిల సమస్యను నువ్వేనా ఆలకించంటూ ఎద్దుకు వినతిపత్రం అందించారు. కనీస వేతనం 26000/`ఇవ్వాలని, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, చివరి నెల జీతంలో సగం జీతం పెన్షన్‌ గా ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కూడిన పోస్ట్‌ కార్డులు ముఖ్యమంత్రికి పిసిపల్లి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో పంపడమైనది. అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్‌ ఇంటిని అంగన్వాడి కార్యకర్తలు, సిఐటియు నాయకులు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. చాపాడులో గురువారం కోతికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తల మండల నాయకులు సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు.అందుకే కోతికి తమ బాధలను తెలియజేస్తున్నామన్నారు.చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ వేతనాలు పెంచుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో సిఐటియు, సిపిఎం పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి, పలు సంఘాల ప్రతినిధులు అంగన్వాడీలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం నిర్వహించిన సమ్మెలో సీఎం జగన్మోహన్‌ రెడ్డికి పోస్ట్‌ కార్డు ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో పోస్టల్‌ కార్డు ఉధ్యమం చేపట్టారు. పలు జిల్లాల్లో పోసట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు