Monday, April 29, 2024

కాంగ్రెస్ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్‌ గా సినీ నటి దివ్యవాణి

తప్పక చదవండి
  • ఆమోదించిన పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్

హైదరాబాద్ : సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా నటి దివ్యవాణికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్‌గా పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్ నియమించారు. ఈ సందర్బంగా దివ్యవాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో తనను బాగా ఆకర్షించిందని తెలిపారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలిపారు. విజన్‌ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉందని, కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్నదని, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేనిఫెస్టో అద్భుతమని, ఇది ప్రజల మదిలో నుంచి పుట్టిన అంశాలు ఉన్నాయన్నారు. ఇక గతంలో విజన్ కలిగిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కొన్ని కారణాల వలన ఏడాదిన్నర క్రితం బయటకు వచ్చానని, వివిధ పార్టీలు ఆహ్వానించినా.. చేరలేదన్నారు. నీతి, నిజాయతీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలని ఫిక్స్ అయ్యాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారురాలు విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరడం కూడా నన్ను ఆకర్షితురాలిని చేసిందన్నారు. ప్రతి పేద వాడు బాగుపడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనకు కాంగ్రెస్ మేనిఫెస్టో లో అత్యధికంగా నచ్చిన అంశం ప్రగతి భవన్ కాదది ప్రజాభవన్ అని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకురాలు సాహితీ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడమే కాకుండా పేపర్ లీకేజ్‌లకు కారణమైనదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ లాభం చేకూరుస్తుందని ఆకర్షితులయ్యమన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు